
Telanganapatrika (May 16): Mallial Police Station. మల్యాల పోలీస్‌స్టేషన్ పరిధిలో మేకలు, గొర్లు దొంగతనం కేసును మల్యాల పోలీసులు గురువారం ఛేదించారు. మల్యాల సీఐ నీలం రవి తెలిపిన వివరాల ప్రకారం మల్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఎస్సై తన సిబ్బందితో వాహన తనిఖీలో చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న బైక్, ఆటోను పరిశీలించారు. ఆటోలో మేకలతో ముగ్గురు పట్టుబడ్డారు. ఈ తనిఖీల్లో బైక్, ఆటో నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా గత నాలుగు నెలలుగా జగిత్యాల జిల్లాలో చెప్యాల, బుగ్గారం, మద్దుట్ల, ఓబులపూర్, పెగడపల్లి గ్రామాలలో రాత్రి సమయంలో మేకలు, గొర్లులను దొంగలించినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి ఒక బైక్, ఒక ఆటో, రెండు మేకలు, రెండు గొర్రెలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులు మద్దవేణి అనిల్, మహమ్మద్ మోషీన్, వెంకటేష్ ను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై నరేష్, ఏఎస్ఐ కృష్ణకుమార్, కానిస్టేబుల్ రాజేందర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Read More: Peddapalli jilla collector: మహిళా సంఘాల ద్వారా వృద్ధాశ్రమం నిర్వహణ 70 లక్షల రూపాయలతో వృద్ధాశ్రమం నిర్మాణం!
Comments are closed.