
భారతీయ డిజిటల్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. సాధారణంగా ఎవరూ ఇష్టపడని బొద్దింక (Cockroach) అనే కీటకం చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ వినోదం, వ్యంగ్యం (Satire) సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాకు చెందిన, విదేశాల్లో చదువుకుంటున్న అభిజీత్ దీప్కే అనే విద్యార్థి ప్రారంభించిన ‘కాక్రోచ్ జంత పార్టీ’ (Cockroach Janta Party – CJP) నెట్‌లో వేలాది మంది ఫాలోవర్లను సంపాదిస్తూ సరికొత్త చర్చకు దారితీసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) బ్యాక్‌గ్రౌండ్ బయటకు:
పైకి ఇది కేవలం ఒక విద్యార్థి చేసిన పొలిటికల్ సెటైర్ లాగా కనిపిస్తున్నప్పటికీ, దీని వెనుక పెద్ద రాజకీయ ప్రణాళిక ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తో బలమైన సంబంధాలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అతను 2020 నుండి 2023 వరకు ఆప్ సోషల్ మీడియా టీమ్‌లో వాలంటీర్‌గా పనిచేశాడని, 2020 ఢిల్లీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించాడని తెలుస్తోంది. ఆప్ అగ్రనేత మనీష్ సిసోడియాతో అతను దిగిన ఫోటోలు కూడా ఇప్పుడు నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి.
కేజ్రీవాల్ కోర్టు వివాదాలు – టైమింగ్ వెనుక అసలు స్కెచ్:
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా కోర్టులతో తలపడుతున్న తరుణంలోనే ఈ పార్టీని తెరపైకి తీసుకురావడం గమనార్హం. మే 15న సుప్రీంకోర్టు విచారణల సందర్భంగా వచ్చిన కొన్ని వ్యాఖ్యలను బేస్ చేసుకుని, తదనంతరం నీట్ (NEET) పేపర్ లీకేజీ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఈ Cockroach Janta Party మొదటి ఆన్‌లైన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. కేజ్రీవాల్ విద్యార్థులకు పిలుపునిచ్చిన కొన్ని రోజులకే ఈ క్యాంపెయిన్ ఊపందుకోవడం విశేషం.
వ్యాక్యులం క్రియేట్ చేస్తున్న నెరేటివ్స్:
గతంలో అన్నాహజారే నేతృత్వంలో వచ్చిన ‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ ఉద్యమం తరహాలోనే, ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా యువతను ముఖ్యంగా జెన్-జీ (Gen Z) యూజర్లను ఆకట్టుకోవడానికి ఈ డిజిటల్ ప్రయోగం చేస్తున్నట్లు పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మీడియా సైతం దీనిపై ఫోకస్ పెట్టడం గమనార్హం. ప్రజాస్వామ్యంలో వ్యంగ్యానికి స్థానం ఉన్నప్పటికీ, ఇలాంటి సింబల్స్ వెనుక ఉన్న అసలు పొలిటికల్ అజెండాలను ఓటర్లు గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతిరోజూ తాజా వార్తలు మీ వాట్సాప్‌కు నేరుగా అందుకోండి — Telanganapatrika WhatsApp Channel ని ఇప్పుడే Follow చేయండి. తాజా వార్తల కోసం మా Google News పేజీని కూడా Follow చేయండి.

