TG PGECET 2026 Exam Postponed: తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG PGECET 2026) పరీక్షకు సంబంధించిన కీలక అప్డేట్ విడుదలైంది. మే 28న నిర్వహించాల్సిన పరీక్షను జూన్ 1కి వాయిదా వేసినట్లు జేఎన్‌టీయూ హైదరాబాద్ ప్రకటించింది.

బక్రీద్ పండుగ మే 28న ఉండటంతో విద్యార్థుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వవిద్యాలయం తెలిపింది. అయితే పరీక్ష సమయాల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది.
ఇక మే 29, 30, 31 తేదీల్లో నిర్వహించాల్సిన ఇతర పరీక్షలు యథావిధిగా కొనసాగనున్నాయి.
TG PGECET 2026 Exam Postponed హాల్ టికెట్లు ఎప్పటి నుంచి?
TG PGECET 2026కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను మే 22 ఉదయం 11 గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
విద్యార్థులు పరీక్ష తేదీల మార్పులను గమనించి, తాజా షెడ్యూల్ ప్రకారం సిద్ధం కావాలని అధికారులు సూచించారు.
Read More: Read Today’s E-paper News in Telugu

