VD Satheesan Kerala CM: VD Satheesan ఈరోజు కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. United Democratic Front ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ కార్యక్రమం తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరగనుంది.

దశాబ్దం తర్వాత UDF అధికారంలోకి
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన UDF10 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వస్తోంది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పుగా భావిస్తున్నారు.
VD Satheesan Kerala CM కాంగ్రెస్ అగ్రనేతల హాజరు
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి Rahul Gandhi , Priyanka Gandhi Vadra, Mallikarjun Kharge తో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.
ప్రమాణ స్వీకారానికి ముందు ఆశీర్వాదాలు ప్రమాణ స్వీకారానికి ముందు వీడి సతీశన్ Cardinal Moran Mor Baselios Cleemis ను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
21 మంది మంత్రులతో కేబినెట్
కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రితో కలిపి 21 మంది మంత్రులతో ఏర్పడనుంది. అందులో కాంగ్రెస్ పార్టీకి 11 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని సమాచారం.
IUMLకు కీలక స్థానాలు
కూటమి భాగస్వామి అయిన Indian Union Muslim League కు 5 మంత్రి పదవులు దక్కే అవకాశముందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
కేబినెట్ కూర్పుపై ఆసక్తి
కొత్త మంత్రివర్గ కూర్పు ద్వారా UDFలో శక్తి సమీకరణాలు , పార్టీలకు దక్కిన ప్రాధాన్యం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.
వీడి సతీశన్ ప్రమాణ స్వీకారంతో కేరళలో కొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభంకానుంది. దశాబ్దం తర్వాత అధికారంలోకి వస్తున్న UDF ప్రభుత్వం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారి తీసే అవకాశముంది.
Read More: Read Today’s E-paper News in Telugu

