TG CPGET 2026: Telangana State Council of Higher EducationTG CPGET 2026 నోటిఫికేషన్‌ను మే 15న విడుదల చేయనుంది. తెలంగాణలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలు జూలై మొదటి వారంలో కంప్యూటర్ ఆధారిత విధానంలో జరగనున్నాయి.

TG CPGET 2026 ముఖ్యమైన తేదీలు
రిజిస్ట్రేషన్ తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం → మే 15
చివరి తేదీ (లేట్ ఫీ లేకుండా) → జూన్ 10
లేట్ ఫీతో అప్లికేషన్
రూ.500 లేట్ ఫీతో → జూన్ 14 వరకు
రూ.2000 లేట్ ఫీతో → జూన్ 18 వరకు
అప్లికేషన్ ఫీజు వివరాలు
ఒక్క సబ్జెక్ట్‌కు
OC / BC విద్యార్థులు → రూ.800
SC / ST / PH విద్యార్థులు → రూ.600
అదనపు సబ్జెక్ట్‌కు రూ.450 చెల్లించాలి. అప్లికేషన్ ఎడిటింగ్ అవకాశం విద్యార్థులు తమ అప్లికేషన్ వివరాలను జూన్ 16 నుంచి జూన్ 19 వరకు సవరించుకునే అవకాశం ఉంటుంది.
హాల్ టికెట్లు
TG CPGET 2026 హాల్ టికెట్లను జూన్ 28 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
40 సబ్జెక్టులకు పరీక్షలు
Kakatiya University వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మొత్తం 40 సబ్జెక్టులకు ఎంట్రన్స్ టెస్టులు నిర్వహిస్తారు, 46 సబ్జెక్టులకు అడ్మిషన్లు చేపడతారు కామన్ ఎంట్రన్స్ ఉండే సబ్జెక్టులు కింది కోర్సులకు ఒకే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు.
- బయోటెక్నాలజీ
- మైక్రోబయాలజీ
- ఫోరెన్సిక్ సైన్స్
- జెనెటిక్స్
- ఎన్విరాన్‌మెంటల్ సైన్స్
- న్యూట్రిషన్ & డైటెటిక్స్
కీలక మార్పు
ఈ ఏడాది నుంచి 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ MSc కోర్సులకు అడ్మిషన్లు TG CPGET ద్వారా కాకుండా Degree Online Services Telangana ద్వారా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
గత ఏడాది గణాంకాలు
Osmania University సమాచారం ప్రకారం గత ఏడాది 62,821 మంది రిజిస్టర్ చేసుకున్నారు , 51,587 మంది అర్హత సాధించారు, 264 కాలేజీల్లో 43,344 సీట్లు అందుబాటులో ఉండగా 45.3% సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి
TG CPGET 2026 నోటిఫికేషన్ విడుదలతో తెలంగాణలో పీజీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. విద్యార్థులు అధికారిక షెడ్యూల్ ప్రకారం దరఖాస్తులు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
