తెలంగాణ పత్రిక (APR.16), Bhainsa Bharosa Center: మంగళవారం భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి భైంసా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ల ద్వారా బాధితులకు చట్టపరంగా అందాల్సిన సహాయాన్ని అందిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.
Bhainsa Bharosa Center సత్ఫలితాలు ఇస్తున్న కౌన్సిలింగ్ లు-ఒకటవుతున్న జంటలు
క్షణికావేశంలో దాంపత్య జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్న ఎన్నో జంటలను భరోసా సెంటర్ ద్వారా అనుభవజ్ఞులైన కౌన్సిలింగ్ ఇచ్చేవారిచేత విడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎన్నో జంటలను కలిపేలా మళ్ళీ వారి జీవితంలో నవ్వుల పువ్వులు పూయించేలా నిర్మల్ జిల్లా ఎస్పి డాక్టర్. జి. జానకి షర్మిల నేతృత్వంలో పోలీసులు నిర్వహిస్తున్న భరోసా సెంటర్ ద్వారా నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ లు మంచి సత్ఫలితాలను ఇస్తోంది. గతంలో జిల్లా మొత్తం మీద ఒక నిర్మల్ పట్టణ కేంద్రంలోనే భరోసా సెంటర్ ఉండేదని అయినప్పటికీ వైవాహిక బంధం విలువ తెలియని కొంతమంది క్షణికావేశంలో విడిపోయే పరిస్థితుల్లోకి వెళ్లినప్పుడు వారి కుటుంబ సభ్యులు భరోసా సెంటర్ ను (Bhainsa Bharosa Center) ఆశ్రయించారు. అలా చాలా జంటలకు కౌన్సిలింగ్ లు నిర్వహించి ఇప్పటివరకు 80 జంటలను కలిపి పంపామని తెలిపారు. వారిప్పుడు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారని అందుకు నిర్మల్ భరోసా సెంటర్ పోలీసులకి జిల్లా ఎస్పీ అభినందనలు తెలియజేశారు.


మరోవైపు భైంసా లోనూ భరోసా కల్పిస్తున్న “భరోసా సెంటర్” పోలీసులు
ఫిర్యాదుల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న భైంసా సబ్ డివిజన్ పోలీసులు
అలాంటిది భైంసా పట్టణంలోనూ భరోసా సెంటర్ ఉంటే బాగుంటుందని భావించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపిఎస్ భైంసా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుండి దాదాపు విడిపోయే క్షణాల్లో వచ్చిన వారికి కూడా భరోసా సెంటర్ పోలీసులు అక్కున చేర్చుకుని అనుభవజ్ఞులైన కౌన్సిలర్స్ చేత మళ్లీ వారి వివాహ బంధానికి అర్ధాన్ని తెలిపేలా ఒకటి చేస్తూ ఎన్నో జంటలను ఏకం చేస్తున్నందుకు జిల్లా భరోసా సెంటర్ పోలీసులను ఎస్పీ జానకి షర్మిల ప్రశంసించారు. అనంతరం గ్రీవెన్స్ కార్యక్రమం ముగిసిన తర్వాత భరోసా సెంటర్ ద్వారా కలిసిన జంటను దగ్గరికి తీసుకుని వైవాహిక బంధం విలువ, దాంతోపాటు క్షణికావేశంలో మనం తీసుకునే నిర్ణయాలు ఒకటికి పది సార్లు ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుందని తెలియజేస్తూ కలిసిపోయిన ఆ జంటను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఎవరికి ఎలాంటి సమస్యలు ఎదురైనా నిర్మల్ జిల్లా పోలీసులు ఎప్పుడు తమకు అండగా ఉండడంతో పాటు భరోసా కల్పిస్తారనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని తెలిపారు. గ్రీవెన్స్ లో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్లో పొందుపరుస్తూ ఏ మేరకు సమస్యలు పరిష్కారం ఏప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపిఎస్, ఇన్స్పెక్టర్ లు నైలు, గోపినాథ్, మల్లేష్, ఎస్ఐ లు శంకర్, గౌస్, గణేష్ మరియు భరోసా సెంటర్ సిబ్బంది జ్యోతి, శిరీష, క్యాంప్ ఇన్చార్జి రఘువీర్ పాల్గొన్నారు.
Read More: Adilabad 2025: ప్రజాస్వామ్య రక్షణే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లక్ష్యం-ఆత్రం సుగుణక్క
