తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులకు గట్టి గుణపాఠం చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. Parents Neglect Law – ‘TEAMPS-2026’ (తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్) పేరుతో కొత్త చట్టం తీసుకొస్తోంది. సోమవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు.

చట్టం ప్రకారం శిక్ష ఏమిటి?
జీతంలో 15% కోత
తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి ఆరోపణలు నిజమని తేలితే సదరు ఉద్యోగి జీతం నుంచి 15% లేదా గరిష్ఠంగా రూ.10,000 (ఏది తక్కువైతే అది) కోత విధిస్తారు. ఈ మొత్తం నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.
ఇంట్లో అందరి జీతాల నుంచి కోత
ఒకవేళ ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటే అందరి జీతాల నుంచి సమానంగా కోత విధిస్తారు. ఈ నిబంధనలు ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, బోర్డులు, ఎయిడెడ్ విద్యాసంస్థల ఉద్యోగులందరికీ వర్తిస్తాయి.
Parents Neglect Law – ఫిర్యాదు ఎలా చేయాలి?
45 రోజుల్లో పరిష్కారం
బాధిత తల్లిదండ్రులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో జిల్లా కలెక్టరేట్లలో ఫిర్యాదు చేయవచ్చు. కేవలం 45 రోజుల్లోనే సమస్యను పరిష్కరించేలా గడువు విధించారు. కలెక్టర్ తీర్పుతో సంతృప్తి చెందకపోతే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కమిషన్ను ఆశ్రయించవచ్చు.
ఎవరికి వర్తిస్తుంది?
సొంతంగా పెన్షన్ లేదా ఇతర ఆదాయ వనరులు లేకుండా పూర్తిగా పిల్లలపైనే ఆధారపడిన వృద్ధులకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది. అసోంలోని ‘ప్రణామం’ చట్టం స్ఫూర్తితో ఈ బిల్లు రూపొందించారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
TEAMPS 2026 అంటే ఏమిటి?
TEAMPS అంటే తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో కోత విధించే చట్టం ఇది.
తల్లిదండ్రులు ఫిర్యాదు ఎక్కడ చేయాలి?
బాధిత తల్లిదండ్రులు జిల్లా కలెక్టరేట్లలో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. 45 రోజుల్లో సమస్య పరిష్కరిస్తారు.
TEAMPS చట్టం ఎవరికి వర్తిస్తుంది?
ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, బోర్డులు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేసే ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. పూర్తిగా పిల్లలపైనే ఆధారపడిన వృద్ధ తల్లిదండ్రులు మాత్రమే ఫిర్యాదు చేయగలరు.
ప్రతిరోజూ తాజా వార్తలు మీ వాట్సాప్‌కు నేరుగా అందుకోండి — Telanganapatrika WhatsApp Channel ని ఇప్పుడే Follow చేయండి. తాజా వార్తల కోసం మా Google News పేజీని కూడా Follow చేయండి.
