తెలంగాణ పత్రిక (APR.12), BRS Party @25| బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ వేడుకలు ఏప్రిల్ 27న ఘనంగా జరగనున్న నేపథ్యంలో, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి రేగొండ మండలంలోని రూపిరెడ్డిపల్లి, దమ్మన్నపేట గ్రామాల్లో కీలక కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు.

BRS Party @25 | ఈ సమావేశాల ఉద్దేశ్యం, బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు గ్రామస్థాయిలో కార్యాచరణ రూపొందించడం. కార్యకర్తలలో ఉత్సాహం పెంచుతూ, ప్రతి గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ జెండాలు ఎగురవేసేలా దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ( BRS Party @25 ) చేసిన పోరాటం, పార్టీ వ్యవస్థాపకుడు కేసీఆర్ నాయకత్వాన్ని గుర్తు చేశారు. ఎల్కతుర్తిలో జరగనున్న భారీ బహిరంగ సభకు రేగొండ మండల నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో గులాబీ జెండాలు ఎగురవేసి, బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలన్నారు. రేగొండ మండల కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షుడు పసుల రాజు, రమణారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read more: Read Today’s E-paper News in Telugu