2000 Rupee Note Exchange: 2023లో ₹2,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించినప్పటికీ, అవి చెల్లుబాటులోనే ఉన్నాయని RBI మరోసారి స్పష్టం చేసింది. అంటే ఈ నోట్లను ఇంకా జమ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు.

అయితే ప్రస్తుతం ఈ సేవలు సాధారణ బ్యాంకు శాఖల్లో అందుబాటులో లేవు.
2000 Rupee Note Exchange ₹2,000 నోటును ఎక్కడ మార్చుకోవచ్చు?
- ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న RBI యొక్క 19 Issue Officesలో ₹2,000 నోట్లను మార్చుకునే అవకాశం ఉంది.
- అలాగే అదే కార్యాలయాల్లో మీ బ్యాంకు ఖాతాలో నోట్ల విలువను జమ చేయించుకోవచ్చు.
- India Post ద్వారా కూడా పంపొచ్చు
- సమీప పోస్టాఫీస్ నుంచి India Post ద్వారా ₹2,000 నోట్లను RBI Issue Officeకి పంపవచ్చు.
- నోట్లు అందిన తర్వాత వాటి విలువను మీరు ఇచ్చిన బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.
2000 Rupee Note Exchange ఎందుకు ఉపసంహరించారు?
RBI మే 19, 2023న ₹2,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించింది.
2016 నోట్ల రద్దు తర్వాత నగదు కొరతను తీర్చేందుకు ఈ నోటును ప్రవేశపెట్టారు. తర్వాత ఇతర విలువల నోట్లు తగినంతగా అందుబాటులోకి రావడంతో ₹2,000 నోటు అవసరం తగ్గిందని RBI తెలిపింది.
ఎంత మొత్తంలో నోట్లు ఇంకా చలామణిలో ఉన్నాయి?
RBI వివరాల ప్రకారం…
2023 మేలో చలామణిలో ఉన్న ₹2,000 నోట్ల మొత్తం విలువ ₹3.56 లక్షల కోట్లు 2026 ఏప్రిల్ 30 నాటికి అది ₹5,451 కోట్లుకు తగ్గింది. మొత్తం 98.47% ₹2,000 నోట్లు ఇప్పటికే RBIకి తిరిగి వచ్చాయి.
https://twitter.com/RBI/status/2075078294144438691/photo/1
2000 Rupee Note Exchange పూర్తి వివరాలు ఇవే!
- ₹2,000 నోట్లు ఇప్పటికీ చెల్లుబాటులోనే ఉన్నాయి.
- సాధారణ బ్యాంకుల్లో మార్పిడి సౌకర్యం లేదు.
- RBI 19 Issue Officesలో మార్చుకోవచ్చు.
- India Post ద్వారా కూడా RBIకి పంపొచ్చు.
- నోట్ల విలువను బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.
- ఇప్పటికే 98.47% ₹2,000 నోట్లు తిరిగి వచ్చాయి.
Read More: Read Today’s E-paper News in Telugu
