Telanganapatrika (July 3): 100 Feet National Flag Anniversary, ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ అభినందన, ఈ సందర్భంగా *ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షుడు జే.ఎస్. సెంగార్, రాష్ట్ర అధ్యక్షుడు ఉజ్జిని రవీందర్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గుండా మధుసూదన్ రావు మాట్లాడుతూ, “100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేయడం దేశభక్తికి చిరస్మరణీయ నిదర్శనం” అని ప్రశంసించారు. రాష్ట్రంలో మాజీ సైనికుల చేతుల మీదుగా ఏర్పడిన మొట్టమొదటి జాతీయ జెండా ఇది అని వారు వివరించారు.

దేశభక్తికి కోదాడ ప్రజల ఆదరణ
ఈ జెండా ఏర్పాటుకు కోదాడ ప్రజలు ఆర్థికంగా తోడ్పడడం దేశభక్తికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది. వార్షికోత్సవ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి ఎన్సీసీ విద్యార్థులు హాజరై కవాతులు, దేశభక్తి నృత్యాలు ప్రదర్శించారు.
కార్గిల్ వీరుడికి నివాళి
కార్యక్రమానికి ముందు కార్గిల్ యుద్ధ వీరుడు గోపయ్య వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి *పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడినుంచి , వంద అడుగుల జాతీయ జెండా వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో *వైస్ ప్రెసిడెంట్ రామారావు, జనరల్ సెక్రటరీ ఉపేందర్, ట్రెజరర్ వెంకన్న, పురపాలక మాజీ చైర్‌పర్సన్ ప్రమీల, రమేష్, ఎన్‌సీసీ ప్రవలిక, ప్రగతి నాగేశ్వరావు, ఎంఈఓ సలీం షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!