Telanganapatrika (July 11): ZPHS Ellanthakunta , స్కూల్ కనెక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఐఐటీ మద్రాస్ తో ZPHS ఇల్లంతకుంట హైస్కూల్ భాగస్వామ్యం అయ్యింది. ఈ విషయాన్ని ఐఐటీ మద్రాస్ ఈమెయిల్ నిర్ధారణ చేస్తూ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలికి లేఖ రాసింది. పాఠశాల విద్య, ఉన్నత విద్య మధ్య అంతరాన్ని తగ్గించడం లక్ష్యంగా ఐఐటీ మద్రాస్, సెంటర్ ఫర్ అవుట్ రీచ్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్ (కోడ్) ద్వారా స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్ ప్రారంభించబడింది. ఈ ప్రోగ్రామ్‌లో జిల్లా నుంచి జిల్లా పరిషత్ ఇల్లంతకుంట పాఠశాల ఎంపికయింది

ZPHS Ellanthakunta డిజిటల్ విద్యలో ముందడుగు ఆన్లైన్ ద్వారా కోర్సులు..
ఐఐటీ మద్రాస్, స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీతో కలిసి పనిచేయనుంది. ఈ భాగస్వామ్యంలో ఐఐటీ మద్రాస్ విద్యార్థులకు ఆన్లైన్ కోర్సులు అందిస్తుంది. డేటా సైన్స్ అండ్ ఏఐ,లకు ఏరోస్పేస్, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, ఇంజినీరింగ్ బయోలాజికల్ సిస్టమ్స్, మ్యాథ్స్ అన్‌ప్లగ్ ,గేమ్స్ అండ్ పజిల్స్, పర్యావరణం, ఫన్ విత్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్, లా, ఎలక్ట్రానిక్ Enlarge హ్యుమానిటీస్ వంటి 10 కోర్సులను “8”వారాల వ్యవధితో ఐఐటీ మద్రాస్ విద్యార్థులకు అందిస్తుంది. ఇందుకు విద్యార్థుల నుంచి నామమాత్రం రుసుం ఐఐటీ మద్రాస్ వసూలు చేస్తుంది. పదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ విధానంలో ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే ఈ కోర్సులు 2 నెలల పాటు జరుగుతాయి. కాగా, ఐఐటీ మద్రాస్, సెంటర్ ఫర్ ఔట్రీచ్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్ (కోడ్) ద్వారా స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్ కు మా పాఠశాల భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని జడ్.పి.హెచ్.ఎస్ ఇల్లంతకుంట పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం ప్రేమలత గారు తెలిపారు.దీనికి ఇంచార్జి టీచరుగా పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రంగా పనిచేస్తున్న వుడుత మహేశ్చంద్రను ఐఐటీ మద్రాస్ వారు సూచించడం జరిగింది. ఇకనుండి జడ్.పి.హెచ్.ఎస్. ఇల్లంతకుంట ZPHS Ellanthakunta పాఠశాల ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది.
ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆర్. రమణారెడ్డి,S. మధుసూదన్ రావు,ఎం.మంజుల, ఐ. ప్రదీప్ రెడ్డి,ఎం. లత ,పి. అనిల్ కుమార్,పి. సునీత,CH.పుష్పలత,ఏ. కవిత,P. స్వప్న,సి.హెచ్. సంపత్ రావ్, వి. సరిత, ఎన్. సత్తయ్య, ఫయాజ్ మొహమ్మద్, ఎస్. సుజాత దేవి హర్షం వ్యక్తం చేశారు.
Read More: Read Today’s E-paper News in Telugu
