Telanganapatrika (August 8): Zero Ticket Rules TGRTC , తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGRTC) స్పష్టమైన నిబంధన జారీ చేసింది. రాష్ట్రంలోని మహిళలు ఉచిత బస్సు ప్రయాణం (జీరో టికెట్) పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా అప్డేట్ అయి ఉండాలని అధికారులు తెలిపారు.

Zero Ticket Rules TGRTC ఏం అప్డేట్ ఉండాలి?
- ఆధార్ కార్డులో ఫోటో క్లియర్‌గా ఉండాలి.
- ఆధార్‌లో చిరునామా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినదిగా ఉండాలి.
- పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డుతో ఇకపై జీరో టికెట్ ఇవ్వబడదని స్పష్టం చేశారు.
భైంసాలో జరిగిన ఘటన..
ఇటీవల నిర్మల్ జిల్లా భైంసా నుంచి నిజామాబాద్ వెళ్తున్న RTC బస్సులో కొంతమంది మహిళలు పాత ఉమ్మడి AP ఆధార్ కార్డు చూపించగా, కండక్టర్ జీరో టికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన తర్వాత TGRTC అధికారులు నిబంధనను మళ్లీ ప్రజలకు తెలియజేశారు.
Read More: Read Today’s E-paper News in Telugu