Telanganapatrika (July 15): Youtube AI Update 2025, యూట్యూబ్ ప్రకటన ప్రకారం, ఈ కింద పేర్కొన్న ఏఐ ఆధారిత అంశాలు వీడియోల్లో ఉంటే, క్రియేటర్లు అవే పేర్కొనాల్సి ఉంటుంది:

Youtube AI Update 2025 ఏం మారబోతోంది?
- AI ద్వారా రూపొందించిన వాయిస్‌లు (యానిమేషన్ లేదా మిమిక్రీ)
- ఎడిట్ చేసిన ముఖాలు లేదా ఫేక్ ఫేస్‌ల మార్ఫింగ్
- నిజంగా లేని దృశ్యాలను చూపించి వీక్షకులను మోసం చేసే విజువల్స్
ఈ విషయం స్పష్టంగా వీడియో డిస్క్రిప్షన్లో పేర్కొనకపోతే యూట్యూబ్:
- వీడియోను తొలగించే అవకాశం
- డీమానిటైజ్ చేయడం
- అల్గోరిథం ద్వారా రీచ్ తగ్గించడం వంటి చర్యలు తీసుకోనుంది
యూట్యూబ్ ఉద్దేశం
ఈ చర్యలు తీసుకోవడానికి ప్రధాన కారణం – *వాస్తవ సమాచారాన్ని కాపాడటం, *అపోహలు, ఫేక్ న్యూస్ నివారించడం. చాలామంది క్రియేటర్లు ఏఐ సహాయంతో రాజకీయ నాయకుల వాయిస్‌లు, సెలబ్రిటీ ముఖాలతో పాపులర్ వీడియోలు చేస్తుండటంతో వీక్షకులు తప్పుదారి పడుతున్నారు.
మీకు తగిన సూచనలు
- వీడియోలో ఏఐ వాడితే స్పష్టంగా పేర్కొనండి
- ఇతరుల గుర్తింపును దుర్వినియోగం చేయొద్దు
- డిస్క్రిప్షన్లో AI Content Disclaimer జోడించండి
- మానిటైజేషన్ పొందాలంటే కొత్త గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉండాలి