Telanganapatrika (July 11): Youth Awareness , హుస్నాబాద్ పట్టణంలోని కేరళ హై స్కూల్ హుస్నాబాద్ విద్యార్థిని, విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, గుడ్ టచ్, బాడ్ టచ్,సైబర్ నేరాల గురించి పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి హాజరై మాట్లాడుతూ అందరు కలిసిమెలిసి ఉండాలని ఒకరికొకరు చదువులో సహాయం చేసుకుంటూ ఒక లక్ష్యం, గోల్ ఏర్పాటు చేసుకుని దాని కనుగుణంగా కష్టపడి చదువుకోవాలని అన్నారు. ఎవరు కూడా బాల్య వివాహాలు చేసుకొని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని బాల్య వివాహాలు, మానవ అక్రమా రవాణా గురించి సమాచారం ఉంటె మాకు తెలియజేయాలని సూచించారు.
Youth Awareness క్లిక్ చేస్తే కష్టమే సైబర్ మోసాల జాగ్రత్తలు!
సెల్ ఫోన్స్ అవసరం మేరకు ఉపయోగించాలని, ఎవరు కూడా సైబర్ నేరాలకు గురికావద్దు అని, తెలియని వ్యక్తులు నుండీ వచ్చే మెసేజ్ లకు రెస్పాండ్ కావద్దని, బ్యాంక్ అధికారులము అంటు ఎవరైన ఫోన్ చేసి అకౌంట్ వివరాలూ అడిగితే చెప్పవద్దు విద్యార్థులను ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలు యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా షీటీమ్ నెంబర్ 8712667434 కాల్ చేయాలని సూచించారు. మహిళల రక్షణకు ఎల్లప్పుడు షీటీమ్ అండగా ఉంటుందని తెలిపారు.
Youth Awareness చదువుతోనే భవిష్యత్తు మెరుగవుతుంది..
అపరిచిత వ్యక్తులను నమ్మవద్దని ఈ వయసులో ప్రేమ పెళ్లి అంటూ చెప్పే వారి మాటలు నమ్మవద్దని సూచించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తెరిగి చదువుకోవాలని మనిషి జీవితాన్ని మార్చేది చదువు ఒక్కటేనని చదువు ఉంటే ఎక్కడైనా బతుకుచ్చని తెలిపారు. ఇష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ రాజేందర్, మరియు ఉపాధ్యాయులు, షీటీమ్ బృందం సదయ్య , హెడ్ కానిస్టేబుల్, మహిళ కానిస్టేబుళ్లు ప్రశాంతి, స్వప్న, కానిస్టేబుల్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.