Telanganapatrika (July 04): Women Empowerment , ఇల్లంతకుంట మండలంలోని ఆదర్శ మహిళా సమాఖ్య సేవలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గారు అభినందించారు. ఈ మహిళా సంఘం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అందించే ఆత్మ నిర్భర్ సంఘాతన్ అవార్డుకు ఎంపికైంది.

కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సమాఖ్య సభ్యులు
శుక్రవారం సమాఖ్య ప్రతినిధులు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్‌ను కలిసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆదర్శ మహిళా సమాఖ్య బ్యాంకు రుణాల వినియోగం, రికవరీ, సమీక్ష సమావేశాల నిర్వహణ, సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం వంటి అంశాలను ప్రశంసించారు.
Women Empowerment స్థిర ఆదాయానికి గ్యాస్ ఏజెన్సీ
“Women Empowerment” లక్ష్యంగా, సమాఖ్యకు స్థిర ఆదాయం లభించేందుకు గ్యాస్ ఏజెన్సీ మంజూరు చేయాలని కలెక్టర్ డీఆర్డీఓ శేషాద్రిని ఆదేశించారు. దీని ద్వారా సమాఖ్య ఆర్థికంగా బలపడుతుందని చెప్పారు.
మహిళా సంఘాల అభివృద్ధికి కృషి
ఈ కార్యక్రమంలో డీ.ఆర్డీ.ఓ శేషాద్రి, డి.పి.ఎం వంగ రవీందర్, ఏపీఎం వాణి, మరియు ఎస్‌హెచ్‌జీ సభ్యులు పాల్గొన్నారు. మండల సమాఖ్య ప్రతినిధులు అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
Read More: Read Today’s E-paper News in Telugu
One Comment on “Women Empowerment : ఆదర్శ మహిళలకు గ్యాస్ ఏజెన్సీ గిఫ్ట్..!”