Telanganapatrika (July 05) : viral reddit post , ఆ వ్యక్తి వెల్లడించిన వివరాల ప్రకారం – ఆ మహిళ ఇంట్లో పని చేసి నెలకు రూ.30,000 సంపాదిస్తోందట. ఆమె భర్త రోజువారీ కూలీగా పనిచేసి రూ.35,000 తీసుకుంటున్నాడట. పెద్ద కొడుకు నెలకు రూ.30,000 సంపాదిస్తుంటే, కుమార్తె టైలరింగ్ చేస్తూ రూ.3,000 తీసుకుంటోంది. చిన్న కొడుకు కూడా రూ.15,000 సంపాదిస్తున్నాడట. మొత్తంగా ఈ కుటుంబం నెలకు రూ.లక్షకు పైగా సంపాదిస్తోంది — అది కూడా ఎలాంటి పన్ను లేకుండా!

viral reddit post
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు వివిధ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. “పన్ను చెల్లించని వారికి ఆదాయం ఎక్కువే ఉండొచ్చు,” అని కొందరంటే, “అయితే దుర్వినియోగం కాకుండా వాళ్ల అభివృద్ధికి ఉపయోగించుకుంటే చాలు” అంటూ మరికొందరు స్పందించారు.
ఈ చర్చ వాస్తవ ఆదాయ వ్యత్యాసాలు మరియు పన్నుల విధానంపై కొత్త కోణంలో చర్చను తీసుకొచ్చింది.
Read More: Read Today’s E-paper News in Telugu