తెలంగాణపత్రిక (June 4): vemulawada robbery case, సమయంలో ఏ వన్, బోదాసు అశోక్, తండ్రి పేరు రాములు, 33 ఇయర్స్, కులం, వడ్డెర, గ్రామం, ఎల్లంపేట, అన్నారం, మాచారెడ్డి మండలం కామారెడ్డి జిల్లా ప్రస్తుత నివాసం బాలానగర్, వేములవాడ టౌన్ . ఎ టు, బొమ్మిడి గణేష్, తండ్రి బాలయ్య, 25 సంవత్సరాలు, కులం ,మేదర. గ్రామం, రేకుర్తి, కొత్తపల్లి మండలం కరీంనగర్ జిల్లా ప్రస్తుత నివాసం జాతర గ్రౌండ్, వేములవాడ టౌన్ .ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.ఈనాయత్ నగర్ గ్రామం కమ్మర్పల్లి మండలం నిజామాబాద్ జిల్లాకు చెందిన బడవత్ తిమ్మి, భర్త, మనోహర్ అనే మహిళ తేదీ 01-06-2025 రోజున వేములవాడ దైవదర్శనానికి రాత్రి సుమారు 7:30 గంటలకు రాగా,

09 గ్రాముల బంగారం,ఒక గ్యారెంటీ చైను, ఒక కత్తి, ఆటో, రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం. వివరాలు వెల్లడించిన వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్.
vemulawada robbery case
తిప్పాపూర్ బస్టాండ్ ముందు ఆటో స్టాండ్ వద్ద ఒక వ్యక్తి నిలబడి ఆమెను మీ బంధువులు గుడి వద్ద ఉన్నారని నాకు తెలుసని మిమ్మల్ని గుడి వద్దకు తీసుకు వెళ్తానని మాయమాటలతో నమ్మించి ఆమెను తన ఆటోలో ఎక్కించుకొని వేములవాడలోని చెక్కపల్లి రోడ్డులో గల పెద్దమ్మ టెంపుల్ ప్రాంతానికి తీసుకువెళ్లి, అక్కడ ఎవరు లేని సమయంలో ఆమెను కత్తి తో బెదిరించి ఆమె మెడలో నుండి బంగారు ఆభరణాలైన 3 గ్రాముల పుస్తెలు, 4 గ్రాముల చెవి కమ్మలు,2 గ్రాముల మాటీలు మరియు ఒక గ్యారెంటెడ్ చైను మరియు పరుసులో ఉన్న నగదు డబ్బులు సుమారు 3000 రూపాయలు ఆమె నుండి దోపిడీ చేసుకొని పారిపోగా,తేదీ 03-06-2025 రోజున బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా తేదీ 04.06.2025 రోజున సంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడు అయిన బోదాసు అశోక్ గ్రామం, ఎల్లంపేట, కామారెడ్డి అనునతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా అట్టి దోపిడి చేసిన బంగారు ఆభరణాలను కొన్ని తనవద్ద ఉంచుకొని మిగతావి తన స్నేహితుడు అయిన బొమ్మిడి గణేష్ వద్ద దాచి పెట్టినానని తెలుపగా ఇద్దరు వ్యక్తులను ఈ రోజు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 3 గ్రాముల పుస్తెలు,4 గ్రాముల చెవి కమ్మలు, 2 గ్రాముల మాటీలు,
ఒక రోల్డ్ గోల్డ్ చైన్, ఒక కత్తి, రెండు సెల్ ఫోన్లు, ఒక ఆటో స్వాధీన పరుచుకొని రిమాండ్ కు తరలించడం జరిగింది తెలిపారు. నిందితుడు అయిన బోదాసు అశోక్, గ్రామం, ఎల్లంపేట, కామారెడ్డి గతంలో కూడా ఏల సురేందర్, తండ్రి, దేవయ్య, 45 సంవత్సరాలు, కులం, మాదిగ, గ్రామం, తుర్నాల,సిద్దిపేట జిల్లా. అను అతనిని కూడా నమ్మించి తిప్పాపూర్ బస్ స్టాండ్ వద్ద నుండి ఏటీఎం కు వెళ్ళి వస్తానని అతని బజాజ్ పల్సర్ బండి ని కూడా దొంగిలించినాడు. నిందితులను 24 గంటలలో పట్టుకున్న వేములవాడ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్,హెడ్ కానిస్టేబుల్ లత,కానిస్టేబుల్ లు గోపాల్, సమీయుద్దీన్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!