Telanganapatrika (July 14) : Veenavanka Rain Ritual 2025 – వర్షాలు కురవాలని వీణవంక ఎస్సీ కాలనీవాసులు కప్పతల్లి ఆటాడారు, వానదేవునికి పూజలు నిర్వహించారు.

Veenavanka Rain Ritual 2025.
వర్షాలు కురవాలని కప్పతల్లి ఆటాడిన వీణవంక ఎస్సీ కాలనీవాసులు.తెలంగాణలో వర్షాకాలం ప్రారంభమై, రెండు నెలలు గడుస్తున్నా, వర్షాలు సమృద్ధిగా కురకపోవడంతో చెరువులు కుంటలలో నీరు లేక వెలవెలబోతున్నాయి. వీణవంక మండలంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురవకపోవడంతో అన్నదాతలు బావుల వద్ద నాట్లు ప్రారంభమైన, సాగునీటి కోసం తిప్పలు పడుతున్నారు. కానీ కల్వల ప్రాజెక్ట్, వీణవంక చెరువు కింది భూములు సాగు నీరు లేక పచ్చిక బయళ్లను తలపిస్తుంది.
వీణవంక మండల కేంద్రంలో వర్షాలు సకాలంలో కురవాలని, ఎస్సీ కాలనీ వాసుల ఆధ్వర్యంలో కప్పతల్లి ఆటను, వాన దేవుని పాటలు పాడుతూ, ఇంటింటికి తిరుగుతూ, యువకులు, కుల పెద్దలు, కులస్తులు గ్రామ పురవీధుల గుండా, ఇంటింటికి వెళ్తూ, వారు మాట్లాడుతూ…
వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా వానదేవుడు కనికరించడం లేదని, వర్షం సమృద్ధిగా కురిస్తేనే వ్యవసాయదారులకు బావులలో చెరువులలో నీరు పుష్కలంగా ఉంటుందని, ఇప్పటికే సగం వానకాలం గడిచిపోయిందని, బావుల వద్ద వేసిన పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి దాపిరించాయని, అందుకే వానదేవుడు కనికరం చూపించాలని, కప్పతల్లి ఆటను ఆడడం జరిగిందన్నారు.
- తెలంగాణ వాతావరణ వివరాల కోసం IMD అధికారిక వెబ్సైట్ చూడండి.
మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే — తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేదా ఇతర ప్రాంతాలు — www.telanganapatrika.in లో రాష్ట్రాలు, రాజకీయాలు, ఉద్యోగాలు, విద్య మరియు ప్రజా ప్రయోజనానికి సంబంధించిన విశ్లేషణాత్మక వార్తలు, విశ్వసనీయ సమాచారం మీకోసం అందుబాటులో ఉంటాయి. తాజా వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను ప్రతిరోజూ సందర్శించండి.
