Telanganapatrika (July 31): UPI New Rules 2025, ఆగస్టు 1 నుండి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త నియమాలు అమలు చేయబోతుంది. దేశంలో నెలకు 18.4 బిలియన్ లావాదేవీలు జరగడం వల్ల UPI సిస్టమ్ మీద తీవ్రంగా ఒత్తిడి పడుతుంది. ఈ నేపథ్యంలో PhonePe, Google Pay, Paytm వంటి యాప్‌లకు ప్రభావం పడేలా కొన్ని మార్పులు జరుగుతున్నాయి.

రోజుకు కేవలం 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్
ప్రతి యాప్‌కు బ్యాలెన్స్ చెక్ పరిమితిని రోజుకు 50 సార్లుగా NPCI నిర్ణయించింది. అలాగే, లింక్ చేసిన అకౌంట్లను రోజుకు 25 సార్లు మాత్రమే చూడగలుగుతారు. దీని ద్వారా పీక్ హవర్స్ లో సర్వర్‌లపై వచ్చే ఒత్తిడిని తగ్గించనున్నారు.
Autopay టైమింగ్ స్లాట్లు తప్పక పాటించాలి
సబ్‌స్క్రిప్షన్లు, EMIలు, బిల్లుల వంటి UPI Autopayలు నిర్ణీత సమయాల్లో మాత్రమే జరగాలి:
- ఉదయం 10:00 గంటల లోపు
- మధ్యాహ్నం 1:00 PM నుండి 5:00 PM
- రాత్రి 9:30 PM తర్వాత
ప్రతి ఆటోపే మాండేట్‌కు గరిష్ఠంగా 3 retrials మాత్రమే ఉంటాయి.
Transaction చెక్‌కు 3 సార్లు మాత్రమే అవకాశం
ఒక లావాదేవీ స్టేటస్ చెక్ చేయడానికి గరిష్ఠంగా 3 సార్లు మాత్రమే, 90 సెకన్ల వ్యవధితో చెక్ చేయవచ్చు. అలాగే, chargebacks ను నెలకు 10 సార్లు, ఒక్క entityపై 5 సార్లు మాత్రమే దాఖలు చేయవచ్చు.
Read More: BSF Constable Jobs 2025: చివరి తేదీకి ముందు అప్లై చేయండి – 3,588 పోస్టులు!
UPI New Rules 2025 భద్రతా చర్యలు మరింత గట్టిగా
జూన్ 30 తర్వాత ప్రతి చెల్లింపులో లభించే రిసీవర్ బ్యాంక్-రిజిస్టర్డ్ పేరు చూపబడుతుంది.
90 రోజులు ఉపయోగించని మొబైల్ నెంబర్లతో లింకైన UPI IDలు inactive అవుతాయి.
ప్రతి వారం బ్యాంకులు Mobile Number Revocation List ఆధారంగా డేటా అప్‌డేట్ చేయాలి. వార్షిక సైబర్ సెక్యూరిటీ ఆడిట్ తప్పనిసరి.
వినియోగదారులు ఏం చేయాలి?
ఎటువంటి ప్రత్యేక చర్య అవసరం లేదు — యాప్స్ ఆటోమేటిక్‌గా ఈ మార్పులు అమలు చేస్తాయి.
కానీ మీరు:
- ఎక్కువగా బ్యాలెన్స్ చెక్ చేయకుండా ఉండాలి
- Autopayలు కేవలం slot టైమ్స్ లో మాత్రమే ప్లాన్ చేయాలి
- రిసీవర్ పేరు కచ్చితంగా చూసి మాత్రమే పంపించాలి