Unanimous Sarpanch Election: సర్పంచ్ పదవి ఎన్నిక ideally ప్రజల ఓట్లతో న్యాయంగా జరగాలి. కానీ కొన్ని ప్రాంతాల్లో రాజకీయాలు, డబ్బు—ఈ రెండూ కలసి ప్రజాస్వామ్యాన్ని పక్కకు నెట్టేస్తున్నాయి. తాజాగా తెలంగాణలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

చాలా గ్రామాల్లో డబ్బు ప్రభావం పెరిగిపోయేందంతో “ఏకగ్రీవంగా” ఎన్నికలు జరగేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరికీ పోటీ లేకుండా, డబ్బు చెల్లించి పదవి దక్కించుకునే పరిస్థితి వెలుగులోకి వచ్చింది.
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని తంకరా గ్రామంలో ఒక వ్యక్తి సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయడానికి గ్రామస్థులకు ₹1 కోటి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని సమాచారం. అంటే పోటీ లేకుండా, నేరుగా పదవి దక్కించుకునేలా గ్రామం మొత్తానికి డబ్బు ఆఫర్ చేస్తున్నాడు.
ఇలాగే జోగులాంబ గద్వాల్ జిల్లాలోని మిట్టడొడ్డి గ్రామంలో కూడా ఇలాంటి సంచలన సమాచారం బయటపడింది. అక్కడ కొందరు వ్యక్తులు సర్పంచ్ పదవి కోసం ₹90 లక్షలు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.
తెలంగాణలో ఇటువంటి ఎన్నో గ్రామాల్లో సర్పంచ్ పోస్టులు భారీ ధరలకు “వేలం ” లా మారిపోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరు ఎక్కువ డబ్బు పెట్టగలరో వారికి ఏకగ్రీవం చేయించే అవకాశం దక్కుతోంది.
Unanimous Sarpanch Election
రాజకీయాల్లో ఇలాంటి ధోరణి చాలా ప్రమాదకరం. ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం దెబ్బతినే అవకాశం ఉంది. అయినా కొంతమంది గ్రామాల్లో డబ్బు కోసం ఈ ప్రక్రియను ఒప్పుకుంటున్న వాస్తవం కూడా అలాగే ఉంది.
Read More: Read Today’s E-paper News in Telugu

One Comment on “Unanimous Sarpanch Election : సర్పంచ్ ఎన్నికల్లో డబ్బు ప్రభావం..”
Comments are closed.