TELANGANAPATRIKA (June 16): TWJF Jagtial Meeting 2025. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (TWJF) జగిత్యాల జిల్లా 3వ మహాసభలు ఈ నెల 18న జరగనున్నాయి. జగిత్యాల జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు వెల్లడించిన సమాచారం మేరకు, ఈ కార్యక్రమం జూన్ 18, బుధవారం ఉదయం 11 గంటలకు దేవిశ్రీ గార్డెన్లో ప్రారంభమవుతుంది. కార్యక్రమంలో జిల్లాలోని ప్రాథమిక సభ్యులు పాల్గొనాలని నేతలు కోరుతున్నారు.

TWJF Jagtial Meeting 2025 మాజీ మంత్రికి ఆహ్వానం
ఈ మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొనవలసిందిగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి, టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు సోమవారం ఆహ్వానించారు. మహాసభలో రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఇతర రాష్ట్ర నాయకులు, స్థానిక సభ్యులు పాల్గొననున్నట్టు తెలిపారు.
ప్రతినిధులకు ఆహ్వానం
ఇంకా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మాజీ మున్సిపల్ ఛైర్మన్లు తాటిపర్తి విజయలక్ష్మి, గిరి నాగభూషణం, భోగ శ్రావణి, ఆడువాల జ్యోతి లను కూడా కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు సమన్వయకర్తలు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా మాజీ అధ్యక్షుడు ఎన్. జైపాల్, సభ్యులు ధ్యావర సంజీవ్ రాజు, ఎన్నం కిషన్ రెడ్డి, ఆముద లింగారెడ్డి, రేణికుంట శ్రీనివాస్, రాగం రమేష్ తదితరులు కృషి చేస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
Comments are closed.