Telanganapatrika (July 13): TSRTC దైవ దర్శన టూర్ , సిరిసిల్ల డిపో నుండి స్పెషల్ టూర్ ప్యాకేజీ లో భాగంగా ఆదివారం ఐదవ బస్సును డిపో మేనేజర్ ఏ ప్రకాష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇంతక ముందు వెళ్లినటువంటి టూర్ ప్యాకేజీ బస్సులో ప్రయాణించినటువంటి ప్రయాణికులు చెప్పినటువంటి విజ్ఞప్తులు ఏమనగా చిలుకూరు బాలాజీ, భద్రాచలం,పంచరామాలు, సింహాచలం,అన్నవరం,రామప్ప,లక్నవరం ఇలాంటి సందర్శనలు మునుముందు ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్కువ బస్సులు కల్పించాలన్న కోరిక మేరకు ఈ ఐదవ బస్సును ప్రారంభించామని అంతే కాకుండా సిరిసిల్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

TSRTC దైవ దర్శన టూర్ భక్తుల కోసం RTC అందించిన పవిత్ర ప్యాకేజీ..
అలాగే యాదగిరిగుట్ట-సురేంద్రపురి-బంగారు శివ లింగం-స్వర్ణగిరి టెంపుల్స్ దర్శనానికి స్పెషల్ డీలక్స్ బస్సును నడుపుతున్నట్లు సిరిసిల్ల డీఎం తెలిపారు.తేది 20-07-2025 ఆదివారం రోజున ఉదయం 5 గంటలకు సిరిసిల్ల కొత్త బస్టాండ్ నుంచి డీలక్స్ బస్సు బయలుదేరి యాదగిరిగుట్ట, సురేంద్రపురి, బంగారు శివ లింగం, స్వర్ణగిరి దేవాలయాల దర్శనానంతరం తిరిగి అదే రోజు రాత్రి సిరిసిల్లకు చేరు తుందని తెలిపారు. పెద్దలకు రూ.750, పిల్లల కు రూ.450 చార్జీ ఉంటుందని వివరించారు.ఈ కార్యక్రమంలో ఎస్టిఐ వర్జిలాల్,టిఐ3 బాపురెడ్డి, టిడిపి చైర్మన్ రామ్ రెడ్డి నాయక్ , సంతోష్ నాయక్ , మల్లేష్ ,ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
