Telanganapatrika (July 7): TS ICET 2025 Result & Final Key Out Today, తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ICET) 2025 ఫలితాలను జూలై 7న విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. అలాగే, పరీక్షకు సంబంధించిన తుది సమాధానాలు (ఫైనల్ ఆన్సర్ కీ)నూ అదే రోజున అధికారిక వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉంచనున్నారు.

పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రిజల్ట్స్‌ను తనిఖీ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ icet.tgche.ac.in కు వెళ్లి, హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేది ద్వారా లాగిన్ అయ్యి ర్యాంక్ కార్డు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
TS ICET 2025 పరీక్ష జూన్ 8 మరియు 9 తేదీలలో రెండు షిఫ్ట్‌లలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) రూపంలో నిర్వహించబడింది. ఈ పరీక్ష ద్వారా విద్యార్థులు MBA మరియు MCA కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పొందుతారు.
కౌన్సిలింగ్ వివరాలు త్వరలో:
ఫలితాల ప్రకటన అనంతరం, అభ్యర్థుల కౌన్సిలింగ్ షెడ్యూల్, సీటు కేటాయింపు, డాక్యుమెంట్ల ధృవీకరణకు సంబంధించిన సమాచారం అధికారికంగా ప్రకటించబడనుంది. అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డును ప్రింట్ తీసుకొని కౌన్సిలింగ్ సమయంలో తప్పనిసరిగా సమర్పించాలి.
TS ICET 2025 అధికారిక సమాచారం కోసం:
అభ్యర్థులు కౌన్సిలింగ్ అప్డేట్స్, తదుపరి ప్రక్రియల కోసం TS ICET అధికారిక వెబ్‌సైట్ను క్రమం తప్పకుండా పరిశీలించాలి.
తాజా అప్‌డేట్స్ కోసం ఇంకా www.telanganapatrika.in ను ఫాలో అవ్వండి