Telanganapatrika (July 13): కల్లు బంద్ , హైదరాబాద్ నగరంలో కల్తీ కల్లు వల్ల ప్రజల ప్రాణాలు పోతున్న ఘటనల నేపథ్యంలో, కల్లు విక్రయాలపై నిషేధం విధించేందుకు తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

కల్తీ కల్లు తాగి ప్రాణాలు పోతున్న ఘటనలు
ఆధికారుల సమాచారం ప్రకారం, ప్రస్తుతం హైదరాబాద్‌లో 90% కల్లు రసాయనాలతో తయారవుతోంది. కేవలం 10% మాత్రమే సహజ కల్లుగా ఉన్నదని వెల్లడించారు. దీనివల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయి.
ప్రభుత్వం సీరియస్
ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు త్వరలో కీలకంగా సమావేశం కానున్నారు.
ఈ సమావేశంలో:
- కల్లు విక్రయాలపై నిషేధం
- కల్లు సొసైటీలకు ప్రత్యామ్నాయ ఉపాధి
పై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.
కల్లు బంద్ కల్లు సొసైటీ కార్మికులకు భరోసా?
కల్లు విక్రయం ఆపితే ఉద్యోగాలు కోల్పోయే వారిని ప్రభుత్వం విస్మరించదు. వారికి ఇతర ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం త్వరలో ప్రత్యేక పథకాలు ప్రకటించే అవకాశముంది.
ప్రజల ఆరోగ్యమే ముఖ్యమన్న ప్రభుత్వమే
ఈ నిర్ణయం తీసుకోవాలన్నది పూర్తిగా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఫేక్ కల్లు వల్ల జీర్ణ సంబంధిత, కిడ్నీ సంబంధిత వ్యాధులు అధికంగా నమోదవుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మంత్రి భేటీ తర్వలో
ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.
Read More: Read Today’s E-paper News in Telugu