Telangana Patrika (October 03): Check Today Horoscope In Telugu – 03 October 2025 మేషం నుండి మీనం వరకు పూర్తి రాశి ఫలితాలు. ఉద్యోగం, ఆర్థికం, కుటుంబం గురించి తెలుసుకోండి.

Today Horoscope In Telugu: 03 అక్టోబర్ 2025 రాశి ఫలితాలు!
ఈ రోజు శుక్రవారం, 03-10-2025. Today Horoscope In Telugu ప్రకారం, శుక్రుడి ప్రభావంతో కొన్ని రాశులకు విశేష లాభాలు, మరికొన్నింటికి జాగ్రత్తలు సూచించబడుతున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి, కుటుంబ జీవితం మరియు ఆరోగ్యంపై ఈ రోజు మీ రాశికి ఏమి చెబుతోందో సవివరంగా చూడండి.
| అంశం | వివరాలు |
|---|---|
| తేది | శుక్రవారం, అక్టోబరు 3, 2025 |
| సంవత్సరం | శ్రీ విశ్వావసు నామ సంవత్సరం |
| అయనము | దక్షిణాయనం – శరదృతువు |
| మాసం | ఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం |
| తిథి | ఏకాదశి – మ. 2:33 వరకు |
| వారం | శుక్రవారం (భృగువాసరే) |
| నక్షత్రం | శ్రవణం – ఉ. 6:51 వరకు |
| యోగం | ధృతి – రా. 8:25 వరకు |
| కరణం | భద్ర – మ. 2:33 వరకు → తదుపరి బవ – రా. 2:15 వరకు |
| వర్జ్యం | ఉ. 10:53 – 12:29 |
| దుర్ముహూర్తము | ఉ. 8:16 – 9:04, మ. 12:14 – 1:01 |
| అమృతకాలం | రా. 8:33 – 10:10 |
| రాహుకాలం | ఉ. 10:30 – 12:00 |
| యమగండ/కేతుకాలం | మ. 3:00 – 4:30 |
| సూర్యరాశి | కన్య |
| చంద్రరాశి | మకరం |
| సూర్యోదయం | ఉ. 5:54 |
| సూర్యాస్తమయం | సా. 5:47 |
మేషం
కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత మిత్రులను కలిసి ముఖ్య విషయాలు చర్చిస్తారు. ప్రారంభించిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారం ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది.
వృషభం
స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్త కార్యక్రమాలకు ప్రారంభం చేస్తారు. సన్నిహితుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారానికి అనుకూలత ఉంటుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది.
మిథునం
ప్రారంభించిన పనుల్లో ఎక్కువ కష్టం, తక్కువ ఫలితం ఉంటాయి. అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో అడ్డంకులు ఉంటాయి. ఆరోగ్యంపై మరింత జాగ్రత్త అవసరం. ఇంటి బయటా ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారం, ఉద్యోగం నిరుత్సాహపరుస్తాయి.
కర్కాటకం
ముఖ్యమైన పనులు వాయిదా వేయబడతాయి. ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు మరింత చికాకు పెడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారం కొంత నెమ్మదిగా సాగుతుంది. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.
సింహం
సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రారంభించిన పనులు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారం, ఉద్యోగంలో కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఇంటి బయటా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
కన్య
కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక వివాదాల నుండి బయటపడతారు. దూరపు బంధువులను కలిసి వివాహ విషయాలు చర్చిస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి.
తుల
ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొత్త రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రారంభించిన పనుల్లో అడ్డంకులు ఉంటాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారంలో నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. ఉద్యోగం నిరాశ కలిగిస్తుంది.
వృశ్చికం
కష్టసాధ్యమైన దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీకు చింత కలిగిస్తుంది. పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. ఖర్చులు ఆదాయాన్ని మించుతాయి. వ్యాపారం నెమ్మదిగా సాగుతుంది. ఉద్యోగంలో ఊహించని మార్పులు ఉంటాయి.
ధనస్సు
బంధువులు, మిత్రులతో ఇంట్లో ఉత్సాహంగా సమయం గడుపుతారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కొత్త కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది.
మకరం
ప్రయత్నించినా పనులు పూర్తి కావు. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. చిన్న అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సమస్యల కారణంగా మనసు ప్రశాంతంగా ఉండదు. ప్రారంభించిన పనుల్లో అడ్డంకులు ఉంటాయి. వ్యాపారం, ఉద్యోగంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి.
కుంభం
ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తుకు మేలు చేస్తాయి. వృత్తి, వ్యాపారాలు సకాలంలో పూర్తి అవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. సంతానం విద్యా విషయాల్లో సంతృప్తి కలిగిస్తుంది.
మీనం
కుటుంబ సభ్యులతో మాటల తగాదాలు ఏర్పడతాయి. వ్యాపారం ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగంలో ఊహించని మార్పులు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో అడ్డంకులు తప్పవు. అవసరం లేకుండా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యంపై కొంత జాగ్రత్త అవసరం.
ప్రతి రోజు మీ రాశి ఫలాలు(Today Horoscope In Telugu) ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అంటే మా తెలంగాణ పత్రిక నీ చూడండి
Disclaimer
రాశిఫలాలు సాధారణ మార్గదర్శకం మాత్రమే. వ్యక్తిగత పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు.

One Comment on “Today Horoscope In Telugu : 03-10-2025 శుక్రవారం రాశి ఫలితాలు!”