Telanganapatrika (July 02): TG EAPCET 2025 Counseling ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి అవసరమైన TG EAPCET-2025 కౌన్సెలింగ్ బుధవారం రెండో రోజు కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 36 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం నడుస్తోంది.

రాజగోపాలపేట పాలిటెక్నిక్ కేంద్రంలో విద్యార్థుల సందడి
సిద్దిపేట జిల్లా రాజగోపాలపేట లోని పాలిటెక్నిక్ హెల్ప్ లైన్ సెంటర్‌లో బుధవారం 470 మంది విద్యార్థులు హాజరయ్యారని కేంద్ర సమన్వయకర్త ప్రధానాచార్యుడు ఆలుగోజు గోవర్ధన్ తెలిపారు.
విద్యార్థులు స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని, తమ ధ్రువపత్రాలను పరిశీలించించుకుని లాగిన్ ఐడీలు పొందారు. ఈ కౌన్సెలింగ్ జులై 6వ తేదీ వరకు కొనసాగనుంది.
TG EAPCET 2025 Counseling ధ్రువపత్రాల పరిశీలనలో భాగంగా పరీక్షించబడిన పత్రాలు
విద్యార్థుల నుంచి పరిశీలించిన ముఖ్యమైన పత్రాలు:
- ఇంటర్మీడియట్ మార్క్ షీట్
- టీజీఈఏపీసెట్ హాల్ టికెట్
- ర్యాంక్ కార్డు
- కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు
- బోనాఫైడ్ సర్టిఫికెట్లు
వీటి ఆధారంగా విద్యార్థులకు వెబ్ ఆప్షన్స్ సూచనలు కూడా చేశారు.
కౌన్సెలింగ్ సిబ్బంది కృషి
ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన సిబ్బంది:
అభినవ్ ఆధ్వర్యంలో —
సయ్యద్ షెహబాజ్, రాజు, పాతూరి శ్రీనివాస్ రెడ్డి, కవిత, శ్రీనివాస్, విజయ్ కుమార్, రాజమౌళి, మధుబాబు, సంతోష్, నవీన్, వాణి, మంజుల లాంటి వారు తమ సేవలందించారు.
కౌన్సెలింగ్ చివరి తేది & తదుపరి దశలు
కౌన్సెలింగ్ చివరి తేది: జూలై 6, 2025
ధ్రువపత్రాల పరిశీలన అనంతరం విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
తరువాత వచ్చే దశలో సీటు కేటాయింపు & జాయినింగ్ ప్రాసెస్ జరుగుతుంది.
Read More: Read Today’s E-paper News in Telugu