Telugu not mandatory for Class X Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాన్-తెలుగు మాట్లాడే విద్యార్థులకు మరోసారి ఊరట కల్పించింది. 2026–27 విద్యా సంవత్సరంలో 10వ తరగతికి తెలుగు తప్పనిసరి కాదని అధికారికంగా ప్రకటించింది.

ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం,
2025–26 విద్యా సంవత్సరంలో 9వ తరగతికి కూడా తెలుగు తప్పనిసరి కాదు
2026–27లో 10వ తరగతికి కూడా ఈ నిబంధన అమలు చేయరు
ఈ విషయాన్ని విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా జారీ చేసిన తాజా మెమోలో స్పష్టంగా పేర్కొన్నారు.
Telugu not mandatory for Class X Telangana ఎవరికీ తెలుగు తప్పనిసరి అవుతుంది?
ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు, వచ్చే విద్యా సంవత్సరంలో (2026–27) 9వ తరగతిలో తెలుగు చదవాల్సి ఉంటుంది. అంటే ఈ మినహాయింపు భవిష్యత్తులో పూర్తిగా కొనసాగదని అధికారులు స్పష్టం చేశారు.
హైకోర్టు పిటిషన్ల నేపథ్యం
నాన్-తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు కొందరు తెలుగు తప్పనిసరి చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పునఃపరిశీలన చేసి, మినహాయింపును పొడిగిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
గతంలో కూడా మినహాయింపు
ఇదివరకే ప్రభుత్వం
2024–25 , 2025–26 విద్యా సంవత్సరాల్లో కూడా తెలుగు తప్పనిసరి నుంచి మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.
స్కూళ్లకు ఆదేశాలు
ఈ నిర్ణయాన్ని
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు తెలియజేయాలని డీఈఓలు, ఆర్జేడీలు కంప్లయెన్స్ రిపోర్ట్ సమర్పించాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.
విద్యార్థులకు ఉపశమనం
ఈ నిర్ణయం వల్ల
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ నేపథ్యంతో ఉన్న పిల్లలు ఎటువంటి ఒత్తిడి లేకుండా తమ చదువును కొనసాగించవచ్చని తల్లిదండ్రులు భావిస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
