working journalist federation తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వేములవాడ నియోజకవర్గం స్థాయి నూతన కార్యదర్శి, సహాయ కార్యదర్శుల ఎన్నిక బుధవారం రోజున స్థానిక పద్మశాలి సంఘంలో ఏర్పాటు చేశారు. వేములవాడ యూనియన్ అధ్యక్షులు తొగరి కరుణాకర్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. నూతన కార్యదర్శిగా నందగిరి చంద్రశేఖర్, సహాయ కార్యదర్శులుగా నిమ్మశెట్టి రాజు, మోటం సంజీవ్ లను సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా అధ్యక్షులు కరుణాకర్ నియామక పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ యూనియన్ బలోపేతం కోసం ఎల్లవేళలా కష్టపడతామని, యూనియన్ కోసం అహర్నిశలు పాటుపడతామని తెలిపారు. అనంతరం అధ్యక్షులు కరుణాకర్ మాట్లాడుతూ గతంలో కార్యదర్శి సహయ కార్యదర్శి స్థానాలు ఖాళీగా ఉన్నందున వారి స్థానంలో ఈ ముగ్గురిని సభ్యుల ఎన్నిక సభ్యుల ఆమోదంతో ఎన్నుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి బొప్ప బిక్షపతి, కొప్పుల ప్రసాద్, ఉపాధ్యక్షులు కవ్వల సురేందర్, అవధూత శ్రీధర్, ఏం ఏ రఫీ, సయ్యద్ షబ్బీర్, గొల్లపల్లి వేణు, కళ్యాడపు వెంకటమల్లు, షాహిద్, చిర్రం ప్రసాద్, ఎగుమంటి మూర్తి రెడ్డి, లాల చంద్రశేఖర్, కొమురవెల్లి మునిష్, తదితరులు పాల్గొన్నారు.
