Advertisement

Telangana Weather Alert: నాలుగు రోజులు వర్షాలతో తెలంగాణ వాతావరణం మారిపోనుంది 2025!

Telangana Weather Alert: మే 5 నుంచి నాలుగు రోజులు వానలు, గాలులు: ఐఎండీ భారీ హెచ్చరిక. తెలంగాణలో వాతావరణ మార్పులు ప్రారంభమయ్యాయి. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, మే 5 (ఇవాళ్టి నుంచి) రాబోయే నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement
telangana-weather-alert-may5-orange-yellow-alert-rains-winds
Telangana Weather Alert ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జిల్లాలు

ఆరెంజ్ అలర్ట్ (భారీ హెచ్చరిక):

Advertisement

అదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి

ఎల్లో అలర్ట్:

హైదరాబాద్ సిటీలోనూ వాతావరణం మబ్బుగా ఉండే అవకాశం 30–40 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది

ఉత్తర తెలంగాణలో ఎండలు భగ్గుమన్నాయి!


తీవ్రమైన ఎండలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఆదివారం నాడు ఉత్తర తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల పైచిలుకు చేశాయి.

  • నిజామాబాద్ (వేంపల్లి): 45.4°C
  • నిర్మల్: 45.2°C
  • జగిత్యాల: 45°C
  • కామారెడ్డి, ఆదిలాబాద్: 44.7°C
  • పెద్దపల్లి: 44.5°C
  • కరీంనగర్: 44.3°C
  • సిరిసిల్ల, మంచిర్యాల: 43.6°C

వర్షపాతం నమోదు అయిన జిల్లాలు


ఆకస్మిక వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిశాయి. ముఖ్యంగా పలు ఉత్తర మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది:

  • ఖమ్మం (గంగారం): 4.8 సెం.మీ
  • సిద్దిపేట (కొండపాక): 4.6 సెం.మీ
  • మిరుదొడ్డి: 4.3 సెం.మీ
  • భద్రాద్రి కొత్తగూడెం: 2.6 సెం.మీ
  • సిద్దిపేట: 2.4 సెం.మీ
  • కుమ్రంభీం ఆసిఫాబాద్: 2.2 సెం.

రైతులకు హెచ్చరిక


ఈ వర్షాలతో పంటలకు నష్టం జరిగే అవకాశం ఉంది. రైతులు విత్తనాలు, పంటల నిర్వహణ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వడదెబ్బ ప్రమాదం నివారించేందుకు ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

Also read: Digital Arrest Scam Khammam: మహిళ నుండి ₹26 లక్షలు మాయం చేసిన సైబర్ నేరగాడు!

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →