Telanganapatrika (July 14): Telangana University VC , నిజామాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ టి. యాదగిరి రావు గారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

వర్సిటీ అభివృద్ధికి పోలీస్ శాఖ సహకారం కోరిన Telangana University VC
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు వీసీని హృదయపూర్వకంగా స్వాగతించి, అభినందనలు తెలిపారు. ఇద్దరి మధ్య స్నేహపూర్వకంగా జరగిన ఈ సమావేశం విద్యా రంగం మరియు పోలీసు విభాగాల మధ్య పరస్పర సహకారానికి ప్రతిబింబంగా నిలిచింది.
ఇలాంటి పరస్పర సంభాషణలు విద్యా సంస్థల అభివృద్ధి, భద్రతా రంగం మధ్య ఉన్న అనుబంధాన్ని బలపరచేందుకు తోడ్పడతాయని అనేకరిని ఆకట్టుకుంది.
Read More: Read Today’s E-paper News in Telugu