Telanganapatrika (August 13): Governor Quota MLC Telangana , రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, గవర్నర్ కోటాలో కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ నియామకంపై దాఖలైన కేసులో, దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది.

Governor Quota MLC Telangana స్టే నిరాకరించిన సుప్రీంకోర్టు – సెప్టెంబర్ 17కి విచారణ వాయిదా
2024 ఆగస్టు 14న సుప్రీంకోర్టు, ఈ నియామకాలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్టే చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్, “కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టేటస్ కో విధించాలి” అని కోరగా, ధర్మాసనం “గవర్నర్ నామినేషన్లను మేము అడ్డుకోలేము” అని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు తన గత తీర్పులో, ఎమ్మెల్సీల నియామకాలు ప్రభుత్వ విధిలో భాగం అని పేర్కొంది. గత ప్రభుత్వం నియమించిన వారిని రద్దు చేసి, కొత్త ఎమ్మెల్సీల నియామకం చేపట్టడంపై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, కుర్ర సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొత్త నియామకాలను నిలిపివేయాలని వారు పిటిషన్‌లో కోరారు.
అయితే, స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. ప్రభుత్వం, గవర్నర్ ఏ నిర్ణయాలు తీసుకున్నా, అవి సుప్రీంకోర్టు తుది ఆదేశాలకు లోబడి ఉండాలి అని కోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 17కి వాయిదా వేసింది
Read More: Read Today’s E-paper News in Telugu