Telanganapatrika (July 22): Telangana Ration Card, తెలంగాణ రాష్ట్రంలో జులై 25 నుంచి రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. ఆగస్టు 10 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ చేరేలా మండల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు తెలియజేశారు.

Telangana Ration Card తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ తేదీలు, ప్రక్రియ వివరాలు..
తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. జూలై 25 నుంచి ఆగస్టు 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మంజూరైన రేషన్ కార్డులు పంపిణీ చేయాలని కలెక్టర్లతో సమీక్షా సమావేశంలో ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేషన్ కార్డుల పంపిణీ ఒక నిరంతర ప్రక్రియ అని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ప్రత్యక్షంగా పాల్గొనాలని స్పష్టం చేశారు.
ప్రస్తుతం సన్నబియ్యం లభ్యం కావడంతో రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగిందని సీఎం పేర్కొన్నారు. పంపిణీ సమయంలో ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని వెంటనే పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.
ప్రజలందరికీ సరైన సమయంలో, పారదర్శకంగా లబ్ధి అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
Read More: Read Today’s E-paper News in Telugu
One Comment on “Telangana Ration Card : జులై 25 నుంచి రేషన్ కార్డుల పంపిణీ – సీఎం కీలక ప్రకటన..!”