
Telanganapatrika (July 28): Telangana panchayat elections 2025, తెలంగాణ రాష్ట్రంలో BCలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ, పంచాయతీ ఎన్నికలు నిర్వహణపై కీలకంగా ఇవాళ్టి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈరోజు (జూలై 28) జరగనుంది.
కోర్టు గడువు ముగిసింది
బ్యాక్వర్డ్ క్లాసుల రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా హైకోర్టు ప్రభుత్వంను ఆదేశించింది. నిర్ణయాన్ని ఒక నెలలో తీసుకోవాలని కోర్టు చెప్పగా, ఆ గడువు రెండు రోజుల క్రితం ముగిసింది. సెప్టెంబర్ 30లోపు పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలన్న కోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి నివేదిక
మంత్రివర్గ సమావేశంలో కీలకంగా చర్చకు వచ్చే అంశాల్లో మొదటిది — జస్టిస్ (రిటైర్డ్) సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన 300 పేజీల నివేదిక. ఈ నివేదికలో కుల గణాంకాలను విశ్లేషించడంతో పాటు, స్థానిక సంస్థలలో BCలకు కల్పించాల్సిన రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చినట్టు సమాచారం.
ఈ నివేదికను మంత్రివర్గం ఆమోదించి అసెంబ్లీలో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది.
రిజర్వేషన్ అడ్డంకులు – రాజ్యాంగానికి IX షెడ్యూల్ చేర్పు!
పంచాయతీ రాజ్ చట్టంలోని 50% హద్దును తొలగించేందుకు రూపొందించిన ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. అదే సమయంలో 42% BC కోటాను రాజ్యాంగ IX షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.
కాళేశ్వరం కేసు నివేదిక వస్తుంది
ఇక మంత్రివర్గ సమావేశంలో మరో ముఖ్య అంశం — కాళేశ్వరం ప్రాజెక్టుపై PC ఘోష్ కమిటీ నివేదిక. కమిటీ గడువు జూలై 31తో ముగుస్తుండటంతో, నివేదిక సమర్పణకు సన్నాహాలు పూర్తయ్యాయి. నివేదికలో ఎలాంటి వివరాలు ఉంటాయన్న ఆసక్తి నెలకొంది.
Read more: BC Politics in Telangana : తెలంగాణలో బీసీ రాజకీయం.. కాంగ్రెస్ vs బీజేపీ మధ్య మాటల యుద్ధం!
Telangana panchayat elections సిగాచీ బ్లాస్ట్ నివేదిక సిద్ధం
హైదరాబాద్‌లోని సిగాచీ ఇండస్ట్రీస్‌లో జరిగిన ఘోర బ్లాస్టులో 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై నివేదికతో పాటు, సిఫార్సులు కూడ కలిపి రాష్ట్రానికి అందించామని నిపుణుల బృందం తెలిపింది. ఈ నివేదికపై మంత్రివర్గం చర్చించనుంది.
ఇంటి పథకాలు, రేషన్ కార్డులు, గిగ్ వర్కర్ల బిల్లు
ఇంకా మంత్రివర్గంలో చర్చకు వచ్చే అంశాలు:
- కొత్త రేషన్ కార్డుల పంపిణీ
- ఇందిరమ్మ ఇళ్లు పథకం
- గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లు
- రాజీవ్ యువ వికాసం పథకం
- ఖరీఫ్ వ్యవసాయ ప్రణాళిక
క్యాబినెట్ సమావేశానికి ఆలస్య కారణం
ఇది అసలు జూలై 25న జరగాల్సిన క్యాబినెట్ సమావేశం. కానీ సీఎం సహా పలువురు మంత్రులు జూలై 24న ఢిల్లీలో ఉన్న కారణంగా అది జూలై 28కి వాయిదా పడింది. BC మంత్రులు ఢిల్లీలో భాగిదారీ న్యాయ్ సమ్మేళనంలో పాల్గొన్న నేపథ్యమే ఇందుకు ప్రధాన కారణం.
తుది నిర్ణయాలు ఎలా ఉంటాయో, ఎవరికి ప్రయోజనం కలుగుతుందో — రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతోంది.