Telangana New Diploma Courses: తెలంగాణలో పాలిటెక్నిక్ చదవాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (SBTET) 2026–27 విద్యా సంవత్సరంనుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్స్‌లో 10 కొత్త డిప్లొమా కోర్సులను ప్రారంభించనుంది.

ఈ కొత్త కోర్సులు ఇండస్ట్రీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించబడ్డాయని SBTET కార్యదర్శి ఏ. పుల్లయ్య తెలిపారు.
Telangana New Diploma Courses కొత్తగా ప్రారంభించే డిప్లొమా కోర్సులు ఇవే
ప్రభుత్వ పాలిటెక్నిక్స్‌లో ప్రారంభించనున్నకొత్త డిప్లొమా ప్రోగ్రాములు ఇవి:
- సెమీకండక్టర్ టెక్నాలజీ
- అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ
- ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్
- ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్
- బయోటెక్నాలజీ
- సివిల్ ఇంజినీరింగ్ (బిల్డింగ్ సర్వీసెస్)
- సివిల్ ఇంజినీరింగ్ – రియల్ ఎస్టేట్ & వాల్యుయేషన్
- కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్
- ఇంటీరియర్ డిజైన్
- ల్యాండ్‌స్కేప్ డిజైన్
సీట్ల సంఖ్య భారీగా పెరుగుతుంది . ఈ కొత్త కోర్సులతో మొత్తం 2,280 కొత్త సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
వాటిలో ముఖ్యంగా:
- సెమీకండక్టర్ టెక్నాలజీ – 720 సీట్లు
- ఆటోమేషన్ & రోబోటిక్స్ – 480 సీట్లు
- అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ – 240 సీట్లు
గ్రామీణ, పేద విద్యార్థులకు లాభం
ఈ డిప్లొమా కోర్సులు ప్రత్యేకంగా గ్రామీణ, తక్కువ ఆదాయ, ఫస్ట్ జనరేషన్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
10వ తరగతి తర్వాత నేరుగా ఉద్యోగాభిముఖ విద్య అందించేలా ఈ కోర్సులు రూపకల్పన చేశారు.
సిలబస్‌లో ఆధునిక అంశాలు
ఇప్పటికే ఉన్న 25 డిప్లొమా కోర్సుల్లో కూడా కొత్త సబ్జెక్టులను చేర్చారు.
అవే:
IoT & Python ప్రోగ్రామింగ్ , AI & మెషిన్ లెర్నింగ్ ప్రాథమికాలు , టెక్నో ఎంట్రప్రెన్యూర్‌షిప్ & స్టార్టప్స్ , సిస్టమ్స్ ఇంజినీరింగ్ , ఇన్నోవేషన్ & డిజైన్ థింకింగ్ ల్యాబ్ , డిజిటల్ ఫ్యాబ్రికేషన్ , IIT హైదరాబాద్ సహకారంతో సిలబస్
ఈ భవిష్యత్ అవసరాల కోర్సుల సిలబస్‌ను IIT హైదరాబాద్, CII, ఇండస్ట్రీ నిపుణులు, అలుమ్ని సహకారంతో రూపొందించారు.
దీంతో విద్యార్థులకు ప్రారంభ దశ నుంచే ఇండస్ట్రీ అనుభవం, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం పాలిటెక్నిక్స్ పరిస్థితి
2025–26 విద్యా సంవత్సరంలో మొత్తం పాలిటెక్నిక్స్: 115 ప్రభుత్వ: 59 ప్రైవేట్: 56 మొత్తం సీట్లు: 30,102 అడ్మిషన్లు పొందినవి: 64 శాతం
కొత్త కోర్సులు, కోర్ ప్రోగ్రాముల్లో అదనపు సీట్లతో రాబోయే విద్యా సంవత్సరంలో 18,300కి పైగా సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
Read More: Read Today’s E-paper News in Telugu
