Telangana Municipal Elections: తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కీలక ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా తుది ఓటరు జాబితాలు మరియు పోలింగ్ స్టేషన్ వివరాలను నిర్దిష్ట తేదీల్లో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది.

Telangana Municipal Elections జనవరి 12న తుది ఓటరు జాబితాల విడుదల
వార్డు వారీగా ఫోటో ఓటరు జాబితాలను జనవరి 12న విడుదల చేయనున్నారు. ఈ జాబితాలు కలెక్టరేట్లు, మున్సిపల్ కమిషనర్ల కార్యాలయాలు, డీఈఏ, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి.
జనవరి 16న పోలింగ్ స్టేషన్ వివరాలు
పోలింగ్ స్టేషన్ లిస్ట్‌తో పాటు పోలింగ్ స్టేషన్ వారీగా ఫోటో ఎలక్టోరల్ రోల్స్ తుది వివరాలు జనవరి 16న ప్రకటిస్తారు. అదే సమయంలో డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్ లిస్ట్‌ను జనవరి 13న Te-Poll వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు.
366 కార్పొరేషన్ వార్డులు, 2,630 మున్సిపల్ వార్డులు
ఈ ప్రక్రియ 6 కార్పొరేషన్లలోని 366 వార్డులు, అలాగే 117 మున్సిపాలిటీల్లోని 2,630 వార్డులకు వర్తిస్తుంది. ఈ విషయాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ. రాణి కుముదిని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో వెల్లడించారు.
BLO ఫోన్ నంబర్ల ప్రచారం
ఇదే సమయంలో, ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి ఓటరు తమ బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) ఫోన్ నంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
‘Book-a-Call with BLO’ సౌకర్యం
ECINET ప్లాట్‌ఫామ్‌లో ఉన్న ‘Book-a-Call with BLO’ సౌకర్యాన్ని ప్రజలకు చేరువ చేయాలని ఆదేశించారు. దీని ద్వారా ఓటర్లు తమ వివరాల సవరణ, ధృవీకరణను సులభంగా చేయవచ్చు.
Telangana Municipal Elections ఓటరు వివరాల అప్డేట్ తప్పనిసరి
BLOల ఫోన్ నంబర్లలో మార్పులు జరిగితే ERO Net పోర్టల్‌లో వెంటనే అప్డేట్ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
Read More: Read Today’s E-paper News in Telugu
