Telangana Inter Exams 2026: తెలంగాణలో 2026 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమైనప్పటికీ, విద్యార్థులకు 9:05 గంటల వరకు కేంద్రంలోకి ప్రవేశించేందుకు 5 నిమిషాల గ్రేస్ టైమ్(అదనపు సమయం) ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.

Telangana Inter Exams 2026 నమోదైన విద్యార్థుల సంఖ్య
ఈ ఏడాది మొత్తం 9,97,075 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు నమోదు అయ్యారు.
మొదటి సంవత్సరం:
- మొత్తం: 4,89,126 మంది
- జనరల్ విభాగం: 2.17 లక్షల అబ్బాయిలు, 2.24 లక్షల అమ్మాయిలు
- వొకేషనల్ విభాగం: 22,586 అబ్బాయిలు, 24,675 అమ్మాయిలు
రెండో సంవత్సరం:
- మొత్తం: 5,07,949 మంది
- జనరల్ విభాగం: 2.31 లక్షల అబ్బాయిలు, 2.30 లక్షల అమ్మాయిలు
పరీక్షా కేంద్రాలు & సిబ్బంది
పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,495 కేంద్రాల్లో నిర్వహించబడతాయి.
- 28,500 ఇన్విజిలేటర్లు
- 1,495 చీఫ్ సూపరింటెండెంట్లు
- 75 ఫ్లయింగ్ స్క్వాడ్స్
- 200 సిట్టింగ్ స్క్వాడ్స్
అధికారులు నియమించారు. ప్రత్యేక ఏర్పాట్లు
Telangana State Road Transport Corporation విద్యార్థుల రవాణా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు.
- విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలి.
- ప్రతి కేంద్రంలో నర్స్, ANM సిబ్బందితో వైద్య సదుపాయం.
- ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు కేంద్రాల సమీపంలో జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని పోలీసులకు సూచనలు.
- ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది.
హాల్ టికెట్లు
హాల్ టికెట్లు కాలేజ్ లాగిన్ పోర్టల్స్‌లో అప్లోడ్ చేశారు. విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ లేదా మీ సేవా కేంద్రాల ద్వారా కూడా పొందవచ్చు.
హాల్ టికెట్‌లో పేరు, మీడియం, సబ్జెక్టులు సరైనవిగా ఉన్నాయో లేదో పరీక్షించుకోవాలి. తప్పులుంటే కాలేజ్ ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలి.
కౌన్సెలింగ్ & కంట్రోల్ రూమ్
విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత కౌన్సెలింగ్ కోసం టోల్ ఫ్రీ నంబర్ 14416 అందుబాటులో ఉంది.
విద్యార్థులు, తల్లిదండ్రుల సందేహాల నివృత్తి కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు:
📞 040-24655027
📞 9240205555
తెలంగాణ ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకుని, హాల్ టికెట్ వివరాలు పరిశీలించి పరీక్షలకు హాజరవ్వాలని అధికారులు సూచించారు.
Read More: Read Today’s E-paper News in Telugu
