Telangana Inter Education: తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2026-27 విద్యా సంవత్సరం నుండి విద్యార్థులకు కొత్త విధానం అమల్లోకి రానుంది.

ఇప్పటి వరకు కేవలం ఇంగ్లీష్ విషయానికే అంతర్గత పరీక్షలు ఉండేవి. ఇకపై అన్ని సబ్జెక్టులకు 20 మార్కుల ఇంటర్నల్ పరీక్షలు ఉంటాయి. ఇక పబ్లిక్ పరీక్షలు 80 మార్కులకు మాత్రమే నిర్వహించబడతాయి.
యాక్టివిటీ ఆధారిత ఇంటర్నల్స్
ఇంటర్నల్ ఎగ్జామ్స్ పూర్తిగా యాక్టివిటీ ఆధారితంగా ఉంటాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎస్. కృష్ణ ఆదిత్య తెలిపారు. విద్యార్థుల ఆచరణాత్మక నైపుణ్యాలను పరీక్షించడానికి ఈ కొత్త పద్ధతి ఉపయోగపడనుంది.
Telangana Inter Education ప్రతి ఏడాది ప్రాక్టికల్ ఎగ్జామ్స్
ఇప్పటివరకు రెండో సంవత్సరం చివర్లోనే ప్రాక్టికల్ పరీక్షలు జరిగేవి. కానీ ఇకపై మొదటి మరియు రెండో సంవత్సరాలకు వేర్వేరు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయి.
ప్రతి ఏడాది చివర్లో 15 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడతాయని అధికారులు తెలిపారు.
MEC విద్యార్థులకు సులభమైన మ్యాథ్స్ పేపర్
ఇంకో ముఖ్యమైన మార్పు – MEC (Mathematics, Economics, Commerce) స్ట్రీమ్ విద్యార్థుల కోసం మ్యాథ్స్ ప్రశ్నాపత్రం సులభతరం చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు MEC పేపర్, MPC (Maths, Physics, Chemistry) పేపర్ స్థాయిలో ఉండేది. ఇకపై MEC విద్యార్థులకు కొంచెం తేలికగా ఉండే విధంగా ప్రశ్నలు రూపొందించనున్నారు. అయితే సిలబస్ మాత్రం రెండింటికీ ఒకటే ఉంటుంది.
సిలబస్ తగ్గింపు, కొత్త పాఠ్యపుస్తకాలు
ఇంటర్ బోర్డు NCERT సిలబస్ ఆధారంగా పుస్తకాలను సవరిస్తోంది. ముఖ్యంగా కెమిస్ట్రీలో పెద్ద భాగం, మ్యాథ్స్ మరియు ఫిజిక్స్‌లో కొంత భాగం తగ్గించే అవకాశం ఉంది. సబ్జెక్ట్ నిపుణుల కమిటీ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.
QR కోడ్ పాఠ్యపుస్తకాలు
విద్యార్థుల అభ్యాసాన్ని సులభతరం చేసేందుకు, ఇంటర్ పాఠ్యపుస్తకాలపై QR కోడ్లు ముద్రించబడతాయి. ఆండ్రాయిడ్ ఫోన్ లేదా టాబ్లెట్‌తో స్కాన్ చేస్తే, ఇంటర్నెట్లో ఉన్న సంబంధిత కంటెంట్‌కి విద్యార్థులు చేరుకోవచ్చు.
Read More: Read Today’s E-paper News in Telugu
