Telanganapatrika (July 26): Teacher Promotions Telangana , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల పదోన్నతులకు చివరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమోషన్లపై ఉన్న ఫైల్‌కు సంతకం చేశారు. దీంతో SGTలు (సెకండరీ గ్రేడ్ టీచర్లు), స్కూల్ అసిస్టెంట్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియకు తెరలేపినట్లైంది.

Teacher Promotions Telangana రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదల అయ్యే ఛాన్స్..
ఈ మేరకు ప్రభుత్వం త్వరలోగా షెడ్యూల్ విడుదల చేయనుంది. సమాచారం ప్రకారం, రెండు రోజుల్లో పదోన్నతుల షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రక్రియను డీఈవో కార్యాలయాల ద్వారానే త్వరితగతిన పూర్తిచేయనున్నట్లు సమాచారం.
తగిన అర్హతలు, సర్వీస్ నియమాలు గల ఉపాధ్యాయులకు ఈ ప్రక్రియ ద్వారా హెచ్చతర స్థాయిలో సేవ చేసే అవకాశం లభించనుంది. పదోన్నతుల తర్వాత పాఠశాలల్లో విద్యా నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ ప్రక్రియను విద్యాశాఖ అధికారులు త్వరగా పూర్తి చేసి ఉపాధ్యాయుల ఆశలు నెరవేర్చాలని స్థానిక టీచర్లు కోరుతున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu