Telanganapatrika (July 29): Tahsildar Anupama Rao – గంగాధర మండల రైతుల ఫిర్యాదులకు వివరణ, భూమి సమస్యలు, రిజిస్ట్రేషన్లపై స్పష్టత ఇచ్చారు.

Tahsildar Anupama Rao Clarification.
ప్రజావాణి లోని ఫిర్యాదులు లకి తహసీల్దార్ వివరణ
కరీంనగర్ జిల్లా గంగాధర మండలనికి చెందిన రైతులు మండల తహసీల్దార్ అనుపమ రావు పై సోమవారం ప్రజావాణిలో పిర్యాదు చేయగా ఇట్టి విషయంపై వివరణ కొరకు మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ మండలం లోని కొంత మంది తను అంటే గిట్టని వారు తమపై తప్పుడు ఆరోపణలు చేసేలా రైతులను ప్రేరేపిస్తున్నారు అని అన్నారు.గట్టు బూత్కూర్ గ్రామానికి చెందిన ఒంటెల భాస్కర్ రెడ్డి 38/2021 ద్వారా ఒంటెల గౌతమి కి విక్రయ దస్తావేజు చేసినారు.మళ్ళీ వచ్చి తాను గౌతమి కి చేసిన రిజిస్ట్రేషన్ గాల భూమి ని వేరే ఎవరికీ రిజిస్ట్రేషన్ చేయకూడదు అని ఫిరియదు చేసినారు. ఇంతకుపూర్వమే భాస్కర్ రెడ్డి గౌతమి కి రిజిస్ట్రేషన్ చేసిన కారణమై తనా ఫిరియదు పరిగణలోకి తీసుకోలేదు.
ఒంటెల గౌతమి విక్రయ దస్తావేజు 193/2025 ద్వారా అమిత్ కుమార్ కి రిజిస్ట్రేషన్ చేసినారు అని తెలిపినారు. అదే గ్రామానికి చెందిన అమడగోని ఎల్లమ్మ పెట్టుకున్న విరసత్ ఫిరియదు తప్పుగా పెట్టుకోవడం మరియు ఫిరియదు కి సంబంధించిన భూమి పాస్ పుస్తకం కార్యాలయంలో ఇవ్వకపోవడం వల్ల ఫిరియదు ని రిజెక్ట్ చేయడం అయినది అని స్పష్టం చేశారు.
అలాగే మండలంలో గాల భూ దళరులను ఫైరోవి కారులని రైతులు సంప్రదించవల్సిన అవసరం లేదు నేను కార్యాలయంలో ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకి మండలంలోని ప్రజలకి అందుబాటులో ఉంటున్నాను ఎలాంటి సమస్యలు ఉన్న రైతులు స్వాతహాగా వచ్చి తమా పనులు చేసుకోవాల్సిందిగా కోరారు.తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన రైతులకి కార్యాలయంలోని సిబ్బంది సకాలం లో పనులు చేయక పోయిన లేదా వారి పట్ల దురుసుగా ప్రవర్తించిన వారి దగ్గర ఏమైనా డబ్బులు ఆశించిన వెంటనే వచ్చి ఫిరియదు చేసినట్లు అయితే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు
తెలంగాణ రిజిస్ట్రేషన్ అధికారిక వెబ్‌సైట్ – registration.telangana.gov.in