Telanganapatrika (August 19): T-Fiber Telangana , తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ముఖ్యంగా టీ-ఫైబర్ ప్రాజెక్ట్ ప్రగతి వివరాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటివరకు ఖర్చయిన వ్యయం, ఇంకా పూర్తి చేయడానికి కావలసిన నిధులు, ప్రస్తుత పనుల స్థితి వంటి అంశాలను స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.

T-Fiber Telangana ప్రతి పల్లె – ప్రతి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్
ప్రజలకు సమానమైన డిజిటల్ సౌకర్యాలు అందించాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్ చేరాలన్న దిశగా పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో గ్రామీణ ప్రాంతాలు కూడా డిజిటల్ విప్లవంలో భాగస్వాములు కానున్నాయి.
డిజిటల్ తెలంగాణ లక్ష్యం
ఈ ప్రాజెక్ట్ పూర్తి కాగానే విద్య, ఉద్యోగాలు, ఈ-గవర్నెన్స్, హెల్త్ సర్వీసులు వంటి అనేక రంగాల్లో ప్రజలకు నేరుగా ప్రయోజనం కలుగుతుందని సీఎం తెలిపారు. తెలంగాణను డిజిటల్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని ఆయన స్పష్టం చేశారు.
Read More: Read Today’s E-paper News in Telugu
One Comment on “T-Fiber Telangana : ఇంటింటికి ఇంటర్నెట్ సీఎం రేవంత్ ఆదేశాలు..!”