తెలంగాణ పత్రిక (APR.28) , sun stroke: రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత జిల్లా ప్రజలకు సీజనల్ వ్యాధుల్లో భాగంగా గత పది రోజుల నుంచి వేడి గాలులతోపాటు ఎండ తీవ్రత బాగా ముదురుతున్నందున సిరిసిల్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

బయటకు వెళ్ళేటప్పుడు ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణాలు, రైతులు వ్యవసాయ పనుల కు బయటకు పోకుండా, తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్లినచో ఎండ దెబ్బ తగలకుండా తల రుమాలు, గొడుగు, టోపీ లతోపాటు తెల్లని కాటన్ దుస్తులు ధరించాలని మరియు త్రాగు నీరు తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లాలని సూచించనైనది.
ఒకవేళ వడదెబ్బ (sun stroke)తగిలితే తీసుకోవలసిన జాగ్రత్తలు..
ఒకవేళ వడదెబ్బ తగిలిన వ్యక్తికి జ్వరము, తల తిరగడం లక్షణాలతో పాటు చెమట రూపంలో అధికంగా బయటికి పోవడం వల్ల అపస్పారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉండడం వలన తక్షణమే సమీపంలోని ప్రభుత్వ దావకానకు, దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గాని, ఆరోగ్య ఉప కేంద్రం నాకు గాని వెళ్లి లేదా దగ్గర్లోనే ఆశ దగ్గరికి వెళ్లి ఓ ఆర్ ఎస్ ద్రావణం సేవించడం వల్ల వడదెబ్బ నుండి రక్షించుకోవాలని, అధిక వేడిగాలతో ప్రజలు అనారోగ్యం పడే అవకాశం ఉండడం వల్ల కొబ్బరి నీళ్లు కొంచెం కొంచెం గా తాగాలని, నిమ్మరసం, మజ్జిగ, చెరుకు రసం వంటి పానీయాలు తీసుకోవాలని, గంటకు ఒక ఒక గ్లాస్ చొప్పున మంచి నీరు తీసుకోవడం వల్ల, ఎయిర్ కూలర్, ఏసీలు వాడడం వల్ల వేడి గాలుల నుంచి నుంచి ,వడదెబ్బ నుంచి రక్షించుకోవచ్చు అని తెలియజేసినారు. ఒకవేళ వడదెబ్బ తగిలిన తక్షణమే 108 అంబులెన్స్ కు సమాచారం అందించి చికిత్స తీసుకోవాల్సిందిగా తెలియజేయునది. ముఖ్యంగా పిల్లలు, వృద్దులు, గర్భిణీలు, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు విషయంలో కుటుంబ సభ్యులు మరింత అప్రమత్తంగా ఉండాలని వారిని జాగ్రత్తగా చూసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత అన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu