Telanganapatrika (August 3): Ellanthakunta , ఇల్లంతకుంట మండల కేంద్రంలోని కేరళ మోడల్ హై స్కూల్ విద్యార్థులు సమీప పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, పోలీసు శాఖ విధులు, సేవల గురించి సమగ్ర అవగాహన పొందారు. పోలీస్ అధికారుల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు నిత్యజీవితంలో పోలీసులు అందించే సేవల గురించి వివరించడంతో పాటు, వారు ఎదుర్కొనే సవాళ్లను పోలీస్ అధికారులు విద్యార్థులకు తెలియజేశారు.

Ellanthakunta Police Station విద్యార్థులు పోలీస్ స్టేషన్ యాత్ర ఒక అనుభూతికర అనుభవం..!
ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాస్ రావు విద్యార్థులకు వివిధ జాగ్రత్తలపై, అనుమానస్పద వ్యక్తుల నుండి భద్రత, హెల్ప్‌లైన్ నంబర్లు తదితర అంశాలపై విలువైన సూచనలు అందించారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పోలీసులపై విశ్వాసం పెంపొందించడంతో పాటు, బాధ్యతాయుతంగా ప్రవర్తించే పౌరులుగా ఎదగడానికి అవసరమైన అవగాహన కలగడంలో దొహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణ కుమార్, ఉపాధ్యాయులు బిన్సీ, లావణ్య, థేరెస్సా, పోలీస్ సిబ్బంది ఫసివోద్దీన్, శ్రీనివాస్, బాల్ రెడ్డి లతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu