Telanganapatrika (July 16): Student Union Bandh , తెలంగాణలో విద్యార్థి సంఘాలు ఈనెల 23న బంద్‌కు పిలుపునిచ్చాయి. విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈ బంద్ జరుగనుంది. స్కూళ్లు, కాలేజీలు బంద్ ఉండే అవకాశం ఉంది. విద్యా రంగ సమస్యలపై దృష్టి సారిస్తూ, వామపక్ష విద్యార్థి సంఘాలు ఈనెల 23న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కి పిలుపునిచ్చాయి.

Student Union Bandh జులై 23 విద్యార్థి బంద్ . ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతం..
ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కొరత, ఖాళీ పోస్టుల భర్తీ లేకపోవడం, స్కాలర్‌షిప్‌లు పెండింగ్‌లో ఉండటం వంటి సమస్యలపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ డిమాండ్లలో ముఖ్యమైనవి:
- ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన
- ప్రైవేటు విద్యా సంస్థలపై ఫీజు నియంత్రణ చట్టం అమలు
- విద్యాశాఖ మంత్రిని తక్షణం నియమించడం
- డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో ఖాళీ పోస్టుల భర్తీ
- పెండింగ్ స్కాలర్‌షిప్‌ల విడుదల
- ఆర్టీసీ ఉచిత బస్ పాసులు అందుబాటులోకి తేవడం
- ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు
ఈ డిమాండ్లను నెరవేర్చాల్సిందిగా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతో బంద్ చేపట్టనున్నట్లు సంఘాలు ప్రకటించాయి. పలు ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు ఈ రోజు బంద్‌కి సహకరించే అవకాశముంది.
ఇది విద్యార్థుల ఆకాంక్షలకు ప్రతీకగా మారుతోందా లేక రాజకీయ ప్రయోజనాల కోసం వినిపిస్తున్న శబ్దమా అన్నది సమాజం నిర్ణయించాల్సిన అంశం. అయినప్పటికీ, విద్యార్థుల వాణి ప్రభుత్వాన్ని మేల్కొలిపేలా చేయడం సమర్థనీయం.
Read More: Read Today’s E-paper News in Telugu