తెలంగాణ పత్రిక (APR.30) , SSC 2025: సంగారెడ్డి జిల్లా పదవ తరగతి పరీక్షల్లో 16 కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలు 100 శాతం ఫలితాలను సాధించాయి. బుధవారం ఈ వివరాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు వెల్లడించారు. మొత్తం 618 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని, అందులో 617 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. కేవలం ఒక పూర్వ విద్యార్థి మాత్రమే ఫెయిల్ అయినట్లు చెప్పారు.

SSC 2025 ప్రైవేటు పాఠశాలలకు గట్టి పోటీగా కస్తూర్బా
అద్భుతమైన ఫలితాలను సాధించిన పాఠశాలల అధ్యాపకులకు అభినందనలు తెలుపుతూ, ఇది వారి శ్రమ ఫలితమేనని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలకు పోటీనిచ్చే విధంగా కస్తూర్బా పాఠశాలలు అగ్రస్థానాల్లో నిలవడం గర్వకారణమన్నారు. ప్రభుత్వ పాఠశాలల నాణ్యతపై ఉన్న అపోహలను తొలగించడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు.
Read more: Read Today’s E-paper News in Telugu