Telanganapatrika (July 12): బీమా డబ్బుల కోసం సొంత అత్తను హత్య చేయించి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన అల్లుడితో పాటు హత్య చేసిన వ్యక్తిని సిద్దిపేట జిల్లా తొగుట పోలీసులు అరెస్టు చేశారని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ర్ డాక్టర్ బి.అనురాధ తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ శనివారం వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ వద్ద రహదారిపై సిద్దిపేటకు చెందిన తాటికొండ రామవ్వ ఈ నెల ఏడవ తేదీన కారు ఢీకొట్టడంతో చనిపోయింది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో రామవ్వ చ*నిపోయిందని పెద్దమాసాన్ పల్లికి చెందిన ఆమె అల్లుడు తాళ్ళ వెంకటేశ్ తొగుట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న తొగుట ఎస్సై రవి కాంత రావు తన సిబ్బందితో రెండు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ
- అల్లుడితో పాటు హ*త్యకు సహకరించిన వ్యక్తి అరెస్ట్
- వాడిన రెండు వాహనాలు సీజ్
- కేసును ఛేదించిన పోలీసులకు రివార్డు
దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలను, టెక్నాలజీ ఉపయోగించి రామవ్వ రోడ్డు ప్రమాదంలో మర*ణించ లేదని, కారుతో కావాలని గుద్ది చంపారని నిర్ధారించుకున్నారు. ఆమె అల్లుడైన తాళ్ల వెంకటేశ్ ను పోలీస్ స్టేషన్ పిలిచి విచారించారు. విచారణలో రామవ్వ గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వల్ల చ*నిపోలేదని, బీమా డబ్బుల కోసం హ*త్య చేయించినట్లు వెంకటేశ్ అంగీకరించాడు. వెంకటేశ్ పెద్ద మాసాన్ పల్లికి చెందిన తన స్నేహితుడైన తాళ్ళ కరుణాకర్ కు రూ.1,30,000ల అప్పుగా ఇచ్చాడు. కోళ్ల ఫారం నిర్వహించడం, వ్యవసాయంలో రూ.22 లక్షల వరకు నష్టం వచ్చింది. గత మార్చి నెలలో దివ్యాంగురాలు అయిన తన అత్తమ్మ తాటికొండ రామవ్వ(50), పేరిట పోస్ట్ ఆఫీస్ లో సంవత్సరానికి రూ.755ల ప్రీమియంతో 15 లక్షల భీమా, ఎస్బీఐ బ్యాంకు లో సంవత్సరానికి రూ.2000ల ప్రీమియంతో రూ.40 లక్షల ప్రమాద బీమా చేయించాడు.
రైతు బీమా కింద రూ 5 లక్షలు రూపాయలు వస్తాయని కరుణాకర్ తండ్రి పేరు మీద ఉన్న 28 గుంటల భూమిని రామవ్వ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు.
ఏదైనా వాహనంతో తన అత్తమ్మ అయిన రామవ్వ గుద్ది చంపేసి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మ*రణించిందని నమ్మించి భీమా డబ్బులు తీసుకోవాలని పథకం వేసుకున్నాడు. ఇందుకోసం తన వద్ద రూ.1,30,000లు అప్పు తీసుకున్న తాళ్ల కరుణాకర్ సహాయాన్ని తాళ్ల వెంకటేశ్ తీసుకున్నాడు. తన అత్తమ్మ రామవ్వను కారుతో గుద్ది చం*పితే అప్పుగా తీసుకున్న రూ.1,30,000లను మాఫీ చేయడంతో పాటు రామవ్వ ఈ బీమా డబ్బులను చెరిసగం తీసుకుందామని కరుణాకర్ ను ఒప్పించాడు.
బీమా డబ్బుల కోసం హ*త్య చేశాడా? పోలీసులు దర్యాప్తులో
పథకంలో భాగంగా ఈనెల ఏడవ తేదీన తాళ్ల వెంకటేశ్ తన అత్తమ్మ అయిన తాటికొండ రామవ్వను పెద్ద మాసానుపల్లికి తీసుకువస్తానని వాట్సాప్ కాల్ చేసి కరుణాకర్ కు తెలిపాడు. తుక్కాపూర్ వద్ద కారుతో ఢీ కొట్టి చంపాలని చెప్పాడు. దీంతో కరుణాకర్ సిద్దిపేటలోని కార్ డ్రైవింగ్ నేర్పించే వారి వద్ద టీఎస్18జీ 2277 నంబరు గల తార్(టీహెచ్ఏఆర్) అనే జీపును డ్రైవర్ లేకుండా తానే నడిపేవిధంగా రోజుకు రూ.2500 కిరాయికి తీసుకున్నాడు. జీపు నెంబర్ కనిపించకుండా టీఆర్ స్టిక్కర్ అతికించాడు. అనుకున్న సమయానికి కరుణాకర్ తాను కిరాయికి తీసుకున్న జీపులో వెళ్ళి తుక్కాపూర్ సమీపంలో వెంకటేశ్ కోసం కోసం ఆగాడు. పది నిమిషాల తరువాత తాళ్ళ వెంకటేశ్ టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనంపై తన అత్తమ్మ రామవ్వను తీసుకుని వచ్చాడు. వాహనాన్ని రోడ్డుపై ఆపి రామవ్వను అక్కడ కూర్చోబెట్టాడు. అనంతరం వెంకటేశ్ పొలంలోకి వెళ్ళాడు. పొలంలో నుంచి తన అత్తమ్మ ను రోడ్డుపై కూర్చోపెట్టిన విషయాన్ని వాట్సాప్ కాల్ ద్వారా కరుణాకర్ కు తెలియజేశాడు. దీంతో కరుణాకర్ తాను కిరాయికి తెచ్చిన జీపుతో వచ్చి రామవ్వను ఢీ కొట్టి వేగంగా వెళ్లిపోయాడు. వేగంగా వెళ్ళిపోయిన కరుణాకర్ ఖమ్మం పల్లి రోడ్డు వద్ద ఆగి రామవ్వను ఢీ కొట్టిన విషయాన్ని వెంకటేశ్ కు వాట్సాప్ కాల్ ద్వారా తెలియజేశాడు. అక్కడే నంబర్ ప్లేట్ పై అతికించిన టీఆర్ స్టిక్కర్ తొలగించి వేసి సిద్దిపేటకు వెళ్లి కిరాయికి తెచ్చిన చోట జీపు అప్పగించాడు.
రామవ్వను భీమా డబ్బుల కోసం జీపుతో ఢీ కొట్టించి హ*త్య చేయించిన అల్లుడు వెంకటేశ్ తో పాటు, కారుతో ఢీ కొట్టిన కరుణాకర్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. జీపుతో పాటు, టీ వీ ఎస్ ఎక్స్ఎల్ ను సీజ్ చేశారు. కీలకమైన ఈ కేసును ఛేదించిన తొగుట సిఐ లతీఫ్, ఎస్సై రవికాంత్ రావు, పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ అభినందించి రివార్డ్ అందజేశారు.

Read More: Read Today’s E-paper News in Telugu