Telanganapatrika (July 10): చెలరేగిపోయిన మట్టిమాఫియా , తల్లాడ , ఏన్కూర్ మండలాల పరిధిలో మట్టిమాఫియా తిరగ బడుతోంది. అక్రమ మట్టి తవ్వకాలు రోజురోజుకు పెరుగుతున్నా, అధికారులు మాత్రం చూపు తిప్పుతున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అనుమతులు తీసుకుని కొందరు దళారులు మట్టిని రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. గుట్టలు, చెరువులు, పచ్చని పొలాలు — ఏదైనా మినహాయింపు లేకుండా ఎక్స్‌కవేటర్లు మోగిపోతున్నాయి. ట్రిప్పర్ల కదలికలు రోజంతా కనిపిస్తున్నా, చర్యలు మాత్రం శూన్యం.
గ్రామస్థాయి కమిటీల్లో వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు, పోలీసు సిబ్బంది ఉండగా కూడా తవ్వకాలపై నియంత్రణ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులపై ప్రజల్లో నమ్మకం తగ్గిపోతుంది. ఫిర్యాదులు వచ్చినా కొన్ని లారీలను సీజ్ చేసి, చిల్లర ఫైన్ వేశారు కాని అసలు ముళ్లుకు కత్తెర పడటం లేదు.
స్థానికంగా కాంగ్రెస్ నేతల అండదండలతో, అధికారులు చేతులెత్తేయడం, ఎన్నికల వేళలో రెవెన్యూ అధికారులు నిష్క్రియంగా ఉండటం, మట్టిమాఫియాకు చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక, పర్మిషన్ తీసుకున్నట్టు నటిస్తూ 5-10 రోజుల పేరుతో నెలల తరబడి తవ్వకాలు సాగిస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu