Advertisement

Sircilla Drug Case : ఇద్దరు అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు..!

Telanganapatrika (July 25): Sircilla Drug Case , ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించామని సిఐ మొగిలి తెలిపారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

ఈ సందర్భంగా సిఐ మొగిలి మాట్లాడుతూ ముస్తాబద్ మండలం గూడెం గ్రామానికి చెందిన సూర అజయ్(19)తండ్రి రమేశ్,సుర ప్రదీప్(18)తండ్రి నర్సయ్య వడ్డెర,గూడెం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గంజాయికి అలవాటు పడిన వారికి ఎక్కువ ధరలకు అమ్ముతూ వాటితో జల్సాలు చేస్తుండేవారని,గూడెం గ్రామంలోని పెద్దమ్మ దేవాలయం దగ్గర ఇద్దరు వ్యక్తులు నిషేధిత గంజాయి అమ్ముతున్నారనే సమాచారం మేరకు ముస్తాబాద్ ఎస్ఐ గణేష్ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లగా అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి వద్ద 109 గ్రాముల గంజాయి ఉండగా అట్టి నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి శుక్రవారం రోజు రిమాండ్ కు తరలించడం జరిగిందని సి.ఐ మొగిలి తెలిపారు.అక్రమంగా గంజాయి సేవించిన, క్రయవిక్రయాలు జరిపిన కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Advertisement

Sircilla Drug Case అక్రమంగా గంజాయి సేవించిన,క్రయ విక్రయాలు జరిపిన,కఠిన చర్యలు తప్పవు.

యువత డ్రగ్స్ భారినపడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ లు ,నార్కోటిక్ జగిలాలతో తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ గంజాయి రవాణాపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపుతున్నారని తెలిపారు.జిల్లాలో గంజాయికి సంబంధించిన సమాచారం సంబంధిత పోలీస్ వారికి సమాచారం అందించి గంజాయి రహిత జిల్లాగా మార్చడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు.

Read More: Read Today’s E-paper News in Telugu

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *