తెలంగాణ పత్రిక (APR.29) , సిద్ధిపేట జిల్లా లో అత్యంత చురుకుగా నడుస్తున్న కూరగాయల మార్కెట్‌ను జిల్లా కలెక్టర్ శ్రీ ఎం. మను చౌదరి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు ప్రజలకు, వ్యాపారస్తులకు మరియు వాహనదారులకు ఎదురవుతున్న సమస్యలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్, తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

సిద్ధిపేట జిల్లా కూరగాయల మార్కెట్‌కు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ?
ప్రతిరోజూ ఉదయం 4:30 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు మార్కెట్ రద్దీగా ఉంటుంది. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల రైతులు కూరగాయలు విక్రయించేందుకు వస్తుండగా, వ్యాపారులు కూడా భారీగా తరలి వస్తున్నారు. మార్కెట్ చుట్టూ స్థలాభావం, అలాగే హైదరాబాద్-కరీంనగర్ మార్గం వెంబడి ట్రాఫిక్ పెరగడం వల్ల మార్కెట్ బయట రోడ్డుపైనే వ్యాపారం సాగుతుంది. ఇది రహదారి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా ట్రాఫిక్ జామ్‌లు ప్రతిరోజూ పెరుగుతున్నాయని మార్కెట్ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
కొత్త మార్కెట్ నిర్మాణానికి Collector ప్రణాళిక:
కూరగాయల మార్కెట్‌కు ప్రత్యామ్నాయ స్థలంగా చిన్న తిమ్మాపూర్ మరియు లక్ష్మక్కపల్లి గ్రామాల మధ్య 55 ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించి, దానికి రూ. 8.73 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.రాష్ట్ర మార్కెటింగ్ డైరెక్టర్‌కు కొత్త మార్కెట్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదన పంపించామని, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సిద్ధిపేట జిల్లా కలెక్టర్ హామీలు:
- వాహనదారులకు అవస్థలు లేకుండా చర్యలు.
- ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం.
- ఆధునికంగా మరియు విస్తృతంగా నిర్మించే మార్కెట్
- రైతులు మరియు వ్యాపారులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం.
ఈ పరిశీలనలో కలెక్టర్‌తో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ బి. విజయ మోహన్, మార్కెటింగ్ అధికారి నాగరాజు, మార్కెట్ కార్యదర్శి బి. రేవంత్ తదితరులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu