Telanganapatrika (July 02): యువత చెడు వ్యసనాల బారిన పడకుండా చూడటం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత అని ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ గారు సూచించారు. అనంతారం గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “మీ కోసం” అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

చెడు అలవాట్లకు చెక్ పెట్టండి… చెడు వ్యసనాలు, గంజాయి వాడకంపై అవగాహన
ఎస్సై అశోక్ గారు మాట్లాడుతూ గంజాయి మత్తు, మద్యం వంటి చెడు వ్యసనాలు యువత జీవితాలను నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది నివారించేందుకు తల్లిదండ్రుల శ్రద్ధ, పర్యవేక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు.
సైబర్ నేరాలపై హెచ్చరికలు
తెలియని వ్యక్తులు పంపే OTPలు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు.
ఫోన్ కాల్స్, లింకులు ద్వారా ఫిషింగ్ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ ధరింపు తప్పనిసరి
మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని హెచ్చరించారు.
డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారే వాహనాలు నడపాలన్నారు.
హెల్మెట్ ధరించకుండా నడిపితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
బహిరంగంగా మద్యం సేవించడం నేరం
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నామని ఎస్సై స్పష్టం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు
ఈ కార్యక్రమంలో విలేజ్ పోలీస్ కానిస్టేబుల్ వెల్మ శ్రీకాంత్ రెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థులం కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
📢 చెడు అలవాట్లకు చెక్ పెట్టండి తల్లిదండ్రులకు సందేశం
ఎస్సై అశోక్ గారు తల్లిదండ్రులకు సూచించారు:
“మీ పిల్లలు ఎవరు కలుస్తున్నారు? వారు సోషల్ మీడియాలో ఏమి చూస్తున్నారు? ఏ రకమైన ప్రవర్తనలో ఉన్నారు అనేది పర్యవేక్షించాలి. అదే మంచి భవిష్యత్తు మార్గం.”
Read More: Read Today’s E-paper News in Telugu
One Comment on “చెడు అలవాట్లకు చెక్ పెట్టండి – తల్లిదండ్రులకి ఎస్సై అశోక్ సూచన”