Telanganapatrika (August 2) : Shah Rukh Khan , బాలీవుడ్ బాద్‌షాగా, కింగ్ ఖాన్గా భారతీయ సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన షారుక్ ఖాన్… ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో కోట్లాది మంది మనసులు గెలుచుకున్నా, ఇప్పటివరకు ఒక జాతీయ అవార్డు కూడా అందుకోలేకపోయారు అన్న విషయం వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ అదే నిజం!

Shah Rukh Khan తొలిసారి ఉత్తమ నటుడిగా ఎంపిక..
ఇప్పుడు ఆ వెలితి తీరింది. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు తాజాగా ప్రకటించగా, షారుక్ నటించిన ‘జవాన్’ చిత్రంలో ఆయన యొక్క పాత్రకు గానూ ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపికయ్యారు. ఇది ఆయన కెరీర్‌లో తొలి జాతీయ స్థాయి పురస్కారం కావడం విశేషం.
అభిమానుల హర్షం
ఈ వార్తతో షారుక్ అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తూ,
“ఇది చాలాకాలంగా ఎదురుచూసిన క్షణం!” అని కామెంట్లు చేస్తున్నారు. అలాగే, “ఒక్కటి మాత్రమే మిగిలిపోయింది, అది కూడా తీరింది” అంటూ హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు.
షారుక్ కెరీర్‌కు ఇది మైలురాయి..
1992లో ‘దివానా’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన షారుక్ ఖాన్
అప్పటి నుంచి అనేక బ్లాక్‌బస్టర్లు: Dilwale Dulhania Le Jayenge, Chennai Express, Pathaan, Jawan
కానీ ఇప్పటిదాకా జాతీయ పురస్కారం అందకపోవడం అనేది గమనార్హం
Read More: Read Today’s E-paper News in Telugu